Hyderabad Metro Rail: వెనక్కి తగ్గిన మెట్రో.. ఆఫర్లు కొనసాగిస్తూ నిర్ణయం..
ఇటీవలే రద్దు చేసిన రాయితీలను, ఆఫర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలలపాటు ఈ రాయతీలు కొనసాగుతాయిని స్పష్టం చేసింది. మెట్రోలో హాలిడే కార్డుతోపాటు, నాన్-పీక్ అవర్స్‌లో రాయితీ చార్జిలు (సువర్ణ ఆఫర్) మళ్లీ పనిచేయబోతున్నాయి.
Hyderabad Metro Rail: మెట్రో రైలు ప్రయాణికులకు మెట్రో నిర్వహణా సంస్థ ఎల్ అండ్ టీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే రద్దు చేసిన రాయితీలను, ఆఫర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలలపాటు ఈ రాయతీలు కొనసాగుతాయిని స్పష్టం చేసింది. మెట్రోలో హాలిడే కార్డుతోపాటు, నాన్-పీక్ అవర్స్‌లో రాయితీ చార్జిలు (సువర్ణ ఆఫర్) మళ్లీ పనిచేయబోతున్నాయి. రూ.59కే మెట్రో హాలిడే కార్డు అందుబాటులో ఉంటుంది.
Gautam Gambhir: కెప్టెన్లలో అతనే తోపు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు
ఈ కార్డు ద్వారా పండుగ సెలవులు, ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాల్లో ఎన్నిసార్లైనా, ఎక్కడికైనా మెట్రోలో ప్రయాణించవచ్చు. హాలిడే రోజు రూ.59తో రీచార్జ్ చేసుకుంటే చాలు. హాలిడే కార్డ్ ఆఫర్ ద్వారా ఏడాదిలో నిర్ణయించిన 100 సెలవు రోజుల్లో, హైదరాబాద్‌లోని 57 మెట్రో స్టేషన్ల పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడివరకైనా, ఎంత సమయం అయినా ప్రయాణం చేసే వీలుంటుంది.గతంలో కొంతకాలం ఈ కార్డు ధరను రూ.99 చేసినప్పటికీ, తిరిగి రూ.59కి తగ్గించారు. అలాగే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, సాయత్రం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మెట్రో కార్డులపై సువర్ణ ఆఫర్ ద్వారా పదిశాతం రాయితీ కల్పించే వారు. అయితే, హాలిడే కార్డును, సువర్ణ రాయితీని ఇటీవలే మెట్రో రద్దు చేసింది.
ఈ ఆఫర్ గడువు గత మార్చి 31తో ముగియడంతో ఆఫర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ, ప్రయాణికుల, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు రావడంతో మెట్రో వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. హాలిడే కార్డు, సువర్ణ ఆఫర్ మరో ఆరు నెలలు కొనసాగుతాయని ఎల్ అండ్ టీ వెల్లడించింది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.