హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌

హైదరాబాద్‌లో హైడ్రా స్పీడ్‌కు రియల్‌ ఎస్టేట్‌ ఇండస్ట్రీ వణికిపోతోంది. బఫర్‌ జోన్‌, FTL పరిధి అంటూ అధికారులు చేపడుతున్న కూల్చివేతలు ఇప్పుడు రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. హైడ్రా యాక్షన్‌ మొదలు పెట్టిన పది రోజుల్లోనే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2024 | 02:27 PMLast Updated on: Aug 31, 2024 | 2:27 PM

Hyderabad Real Estate Hit By Hydra

హైదరాబాద్‌లో హైడ్రా స్పీడ్‌కు రియల్‌ ఎస్టేట్‌ ఇండస్ట్రీ వణికిపోతోంది. బఫర్‌ జోన్‌, FTL పరిధి అంటూ అధికారులు చేపడుతున్న కూల్చివేతలు ఇప్పుడు రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. హైడ్రా యాక్షన్‌ మొదలు పెట్టిన పది రోజుల్లోనే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ లేక్‌ వ్యూ, పాండ్‌ వ్యూ ఇళ్లకు హైదరాబాద్‌లో మంచి డిమాండ్‌ ఉండేది.

హైదరబాద్‌ చుట్టుపక్కల ఇల్లు తీసుకోవాలి అన్నా ఇలాంటి లొకేషన్స్‌ కోసమే కస్టమర్లు వెతికేవాళ్లు. మంచి వ్యూ పాయింట్‌ ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్‌ కోసం జనం ఎగబడేవాళ్లు. అలాంటి లొకేషన్స్‌లో అపార్ట్‌మెంట్‌ ఉంది అంటే ఎగబడి మరీ వెళ్లి అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకునేవాళ్లు. రియల్టర్లు కూడా మంచి లొకేషన్స్‌లో తమ వెంచర్స్‌ ప్లాన్ చేసేందుకే మొగ్గుచూపేవాళ్లు. కానీ ఇప్పుడు హైడ్రా ఎంట్రీతో మొత్తం సీన్‌ మారిపోయింది. లేక్‌ వ్యూలో ఇల్లు తీసుకోవాలి అంటేనే అంతా భయపడుతున్నారు.

అన్ని డాక్యుమెంట్లు సవ్యంగానే ఉన్నా.. ఎందుకు ఈ తలనొప్పి అనుకుని అలాంటి ఇళ్లకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఫ్లాట్స్‌, అపార్ట్‌మెంట్స్‌కు అడ్వాన్స్‌లు ఇచ్చినవాళ్లు వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ డెవలపర్స్‌ మీద ఒత్తిడి చేస్తున్నారట. సిటీ మధ్యలో చిన్న ఇల్లు తీసుకున్నా పర్లేదు కానీ ఎప్పుడు కూల్చేస్తారో తెలియని లేక్‌ వ్యూస్‌ మాకొద్దంటూ పరుగులు పెడుతున్నారట. దీంతో రియల్టర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. చాలా మంది డెవలపర్స్‌కు కస్టమర్లు ఇచ్చే అడ్వాన్స్‌లే ప్రాజెక్ట్‌లో కీలకంగా మారుతుంటాయి. ముందు వెంచర్‌ స్టార్ట్‌ చేసి.. కస్టమర్లు ఇచ్చిన అడ్వాన్స్‌ డబ్బుతో బిల్డింగ్స్‌ కంప్లీట్‌ చేస్తుంటారు. అలాంటి రియలర్టర్లకు ముఖ్యంగా ఇప్పుడు మింగలేని కక్కలేని పరిస్థితి వచ్చిదంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. ముఖ్యంగా ఈ హైడ్రా వల్ల హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.