కేటిఆర్ ఢిల్లీలో ఉండగానే హైడ్రా ఫినిష్ చేస్తుందా…?

తెలంగాణాలో హైడ్రా ఇప్పుడు మరింత దూకుడుగా వెళ్లనుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న వాళ్ళ మీద దృష్టి పెట్టిన సర్కార్ ఇప్పుడు బడా బాబుల మీద దృష్టి పెట్టనుంది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చిన తర్వాతి నుంచి... తర్వాత ఎవరు, తర్వాత ఎవరూ అంటూ జనాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 27, 2024 | 06:24 PMLast Updated on: Aug 27, 2024 | 6:24 PM

Hydra Focus On Ktr Farm House

తెలంగాణాలో హైడ్రా ఇప్పుడు మరింత దూకుడుగా వెళ్లనుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న వాళ్ళ మీద దృష్టి పెట్టిన సర్కార్ ఇప్పుడు బడా బాబుల మీద దృష్టి పెట్టనుంది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చిన తర్వాతి నుంచి… తర్వాత ఎవరు, తర్వాత ఎవరూ అంటూ జనాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ కాలేజి అనుకుంటే కాదు కేటిఆర్ కు చెందిన జన్వాడ ఫాం హౌస్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వీళ్ళ ఇద్దరిది కాదు… మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన భవనాలను కూలుస్తారని అంచనా వేస్తున్నారు.

అయితే వాటి కంటే ముందు కేటిఆర్ కు చెందిన జన్వాడ ఫాం హౌస్ ను కూల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే సూచనలు కనపడుతున్నాయి. జన్వాడ ఫాం హౌస్ వద్దకు వెళ్ళిన ఇరిగేషన్ అధికారులు ఫాం హౌస్ వద్ద సర్వే నిర్వహించారు. కాసేపట్లో జన్వాడ ఫాం హౌస్ ను కూల్చే అవకాశాలు స్పష్టంగా జన్వాడ ఫాం హౌస్ వద్దకు హైడ్రా అధికారులు చేరుకున్నారు. హైడ్రా అధికారులు కూడా సర్వే పూర్తి చేసారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని అక్కడి అధికారులు స్పష్టం చేసారు. నాలా దగ్గర కొలతలు తీసుకున్నట్టుగా వెల్లడించారు.

అయితే తనకు ఫాం హౌస్ లేదని కేటిఆర్ లేదని చెప్పారు. తన మిత్రుడి ఫాం హౌస్ అని ఆయన పేర్కొన్నారు. దీనిపై హైకోర్ట్ కి వెళ్ళగా కోర్ట్ విచారణ జరిపి… జీవో ప్రకారమే అధికారులు ముందుకు వెళ్లాలని కోర్ట్ స్పష్టం చేసింది. దీనితో ఇప్పుడు ఈ ఫాం హౌస్ ను ఎప్పుడు కూలుస్తారనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేటిఆర్ కవిత బెయిల్ కోసం ఢిల్లీ వెళ్ళారు. ఆయన అక్కడ ఉన్నప్పుడే కూల్చాలని హైడ్రా అధికారులు ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తలతో వచ్చి కూల్చివేతకు అడ్డం తగిలే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక దీనితో పాటుగా ఓవైసీ భవనాలను కూడా కూల్చడానికి అధికారులు సిద్దమవుతున్నారు. ఆయన చెరువులను కబ్జా చేసి బిల్డింగ్ లు కట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హైడ్రా చర్యలకు దిగుతోంది.

అయితే కూలిస్తే ఉద్యమం చేస్తామని, అంతకంటే ఎత్తైన భవనాలను నిర్మిస్తామని ఓవైసీ చెప్పుకొచ్చారు. అయినా సరే ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కు తగ్గే సూచనలు కనపడటం లేదు. ఓవైసీ భవనాల విషయంలో జాప్యం వద్దని కూల్చాల్సిందే అని బిజెపి నేతలు కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి రాజీ పడవద్దు అని స్పష్టం చేసారు. తాము అండగా నిలబడతామని బిజెపి నేతలు చెప్పడం విశేషం. జన్వాడ ఫాం హౌస్ కూలిస్తే… దాని తర్వాత ఏ భవనాలను కూల్చాలనే దానిపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.