అప్పుడు చంద్రబాబు కాపాడిన చెరువు, ఇప్పుడు రేవంత్ వంతు…?
హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా హాట్ టాపిక్ అయిపోయింది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చిన తర్వాత ఇక ఎవరిని హైడ్రా వదిలే ప్రసక్తి లేదనే విషయం క్లారిటీ వచ్చింది.
హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా హాట్ టాపిక్ అయిపోయింది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చిన తర్వాత ఇక ఎవరిని హైడ్రా వదిలే ప్రసక్తి లేదనే విషయం క్లారిటీ వచ్చింది. అటు న్యాయస్థానం కూడా ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ఈ నేపధ్యంలో నాచారం పెద్ద చెరువు మీద హైడ్రా అధికారులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. 98 ఎకరాల్లో విస్తరించి ఉన్న నాచారం పెద్ద చెరువును కాపాడే బాధ్యతను తీసుకున్నారు. ప్రస్తుతం 60 నుంచి 70 ఎకరాలకు నాచారం పెద్ద చెరువు పరిమితం అయినట్టు గుర్తించారు.
నాచారం నుంచి ఉప్పల్ వరకు విస్తరించి చెరువు విస్తరించి ఉంది. నాచారం చెరువు నుంచి మీరు ఉప్పల్ చెరువుకు ప్రవహిస్తూ ఉంటుంది. గత 30 ఏళ్లుగా ఆక్రమణకు గురవుతూ వస్తున్న నాచారం పెద్ద చెరువు… గత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలో గతంలోనే నిర్మాణాలు జరిగాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో మిగిలిన చెరువు చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. దాదాపు 30 నుంచి 40 ఎకరాల వరకు అక్రమణకి గురైన చెరువుని ఇప్పుడు కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు ఆక్రమించిన ప్రాంతంలో ల్యాండ్ పట్టా పుస్తకాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. అవన్నీ లంచాలు ఇచ్చి తీసుకున్నవి అని, వదిలిపెట్టవద్దని కోరుతున్నారు ప్రకృతి ప్రేమికులు.