హైడ్రా గురి మారిందా…? ఇప్పుడు టార్గెట్ వాళ్ళే…?
అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన పలువురు అధికారులపై చర్యలకు రంగం సిద్దం చేసింది హైడ్రా. వారిపై ఉన్నతాధికారులకు హైడ్రా అధికారులు ఫిర్యాదులు చేసారు.

అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన పలువురు అధికారులపై చర్యలకు రంగం సిద్దం చేసింది హైడ్రా. వారిపై ఉన్నతాధికారులకు హైడ్రా అధికారులు ఫిర్యాదులు చేసారు. కొద్దిరోజుల క్రితం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు హైడ్రా ఫిర్యాదు చేసింది. వివిధ హోదాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
నిజాంపేట్, చందానగర్, బాచుపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను గుర్తించింది హైడ్రా. రామకృష్ణారావు, సుధాంశు, రాజ్ కుమార్, శ్రీనివాస్,పూల్ సింగ్ చౌహన్ , సుధీర్ కుమార్ పై హైడ్రా ఫిర్యాదులు చేసింది. వీరంతా వివిధ హోదాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమాతలు జారీ చేసినట్లు గుర్తించారు. ఇటీవల నిజాంపేట్, చందానగర్, మేడ్చల్, బాచుపల్లి ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలకు దిగింది.