హైడ్రా గుడ్ న్యూస్… మాకు సంబంధం లేదు…!

హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా దూకుడు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. హైదరాబాద్ లో చెరువుల రక్షణే లక్ష్యంగా దిగిన హైడ్రా ఇప్పుడు మూసి నదిపై కూడా దృష్టి సారించింది అనే వార్తలు వస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 30, 2024 | 04:53 PMLast Updated on: Sep 30, 2024 | 4:53 PM

Hydra Good News About Moosi Project

హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా దూకుడు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. హైదరాబాద్ లో చెరువుల రక్షణే లక్ష్యంగా దిగిన హైడ్రా ఇప్పుడు మూసి నదిపై కూడా దృష్టి సారించింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. మూసీ న‌దికి ఇరువైపులా స‌ర్వేల‌తో హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేసారు. అక్క‌డి నివాసితుల‌ను హైడ్రా త‌ర‌లించ‌డంలేదన్నారు.

అక్క‌డ ఎలాంటి కూల్చివేత‌లు హైడ్రా చేప‌ట్ట‌డంలేదన్నారు. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలోని ఇళ్ల‌పై హైడ్రా మార్కింగ్ చేయ‌డంలేదని తెలిపారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్ర‌త్యేక ప్రాజెక్టు… దీనిని మూసి రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చేప‌డుతోందని స్పష్టం చేసారు. కొందరు హెచ్చరికలు జారీ చేసినా లెక్క చేయడం లేదన్నారు రంగనాథ్.