హైడ్రా@నెల, కూల్చివేసింది ఇవే…
నెల రోజుల్లో హైడ్రా అధికారులు అక్రమార్కులకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడం అనే ఫిర్యాదు వస్తే చాలు అక్కడ కూల్చివేతలు మొదలుపెడుతున్నారు. నెల రోజుల నుంచి దూకుడుగా అడుగులు వేసారు.
నెల రోజుల్లో హైడ్రా అధికారులు అక్రమార్కులకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడం అనే ఫిర్యాదు వస్తే చాలు అక్కడ కూల్చివేతలు మొదలుపెడుతున్నారు. నెల రోజుల నుంచి దూకుడుగా అడుగులు వేసారు. నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి సాధించింది. 18చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది హైడ్రా. పలువురు విఐపి లతో టు పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలపై కూల్చివేతలు చేపట్టారు. 18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది.
నంది నగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జాకార స్థలాన్ని కాపాడింది. లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేయగా… దానిని కూడా కబ్జా నుంచి విడిపించారు. మనసురాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలపై గురి పెట్టి కూల్చివేశారు. ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా చేయగా దాన్ని కూడా హైడ్రా విడిపించింది. మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా…. బి జె ఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడింది. గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేసారు.
గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రమణలు చేసిన భవనాలను కూల్చేశారు. బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూడా కూల్చేశారు. చింతల్ చెరువులో కూడా కబ్జాల మీద దృష్టి పెట్టారు. నందగిరి హిల్స్లో ఎకరం స్థలం కబ్జా చేయగా విడిపించారు. నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేసారు. రాజేంద్రనగర్ చెరువు చుట్టూ చేపట్టిన అక్రమాలను కూడా కూల్చివేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేసారు.
ఎంఐఎం ఎం ఎల్ సి మిర్జా బేగ్ నిర్మించిన రెండంతస్తుల భవనం కూల్చివేశారు. చందానగర్ ఏర్ల చెరువు వద్ద ఉన్న భవనాలను కూడా కూల్చివేశారు. ప్రగతి నగర్ ఎర్రగుంట లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేశారు. బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలను కూడా కూల్చివేశారు. గండిపేట చెరువులో నిర్మించిన ఫాం హౌస్ లను కూల్చివేశారు. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సంబంధించిన ఒరో స్పోర్ట్స్ ను సైతం కూల్చివేశారు. టీటీడీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్ యజమాని ఫామ్ హౌస్ కూల్చివేశారు.
బిజెపి కీలక నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేశారు అధికారు. కూల్చివేసారు. ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూడా కూల్చేశారు. నిన్న మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు.