హైడ్రా నెక్స్ట్ టార్గెట్స్ ఈ జిల్లాలే, ప్లాన్ రెడీ…!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళను ప్రభుత్వం వదలడం లేదు. హైడ్రా అధికారుల దెబ్బకు ఒక్కొక్కరికి చుక్కలు కనపడుతున్నాయి. ఈ రోజు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెర్వు కు హైడ్రా బృందం అధికారులు వెళ్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళను ప్రభుత్వం వదలడం లేదు. హైడ్రా అధికారుల దెబ్బకు ఒక్కొక్కరికి చుక్కలు కనపడుతున్నాయి. ఈ రోజు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెర్వు కు హైడ్రా బృందం అధికారులు వెళ్తుంది. చెరువులు కుంటలు భూ కబ్జా.పై ఆరా తీయనున్నారు అధికారులు. చెర్వు కుంటల పై రైతులు సి. ఎం. కు ఇచ్చిన పిర్యాదు ఆధారంగా అధికారులు వస్తున్నారు. చెర్వు కుంటల భూ కబ్జాల నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటారు. అక్రమ నిర్మాణాలు, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఫామ్ హోజ్ ల మీద దృష్టి పెడతారు.
భవనాలు అక్రమ నిర్మాణాలు నివేదిక సిద్దం చేసి మ్యాప్ తయారు చేయనున్న అధికారుల బృందం… చెర్వు కుంటల పరిధిలో ఉన్న ఫామ్ హోస్ అక్రమ నిర్మాణనానికి పాల్పడ్డ వారిపై చర్యలకు దిగుతుంది. మొదటగా రాష్ట్ర రాజధాని నుండి జిల్లాలకు హైడ్రా బృందం రావడంతో తర్వాత ఏ జిల్లా అనే దానిపై ఆందోళన మొదలయింది. అక్రమ నిర్మాణదారుల్లో వణుకు మొదలయింది. చెర్వు కుంటల కబ్జా నివేదిక అధికారంగా హైడ్రా కూల్చివేతలు మొదలు అవుతాయి.
నివేదిక అనంతరం కూల్చివేతలు మొదలు అవుతాయి. జిల్లాల వారీగా చూస్తే సంగారెడ్డి జిల్లా పఠాన్ చెర్వు, సంగారెడ్డి జహీరాబాద్, ఆందోల్, నారాయణ్ ఖేడ్, మెదక్ జిల్లా మెదక్ నర్సాపూర్, సిద్దిపేట జిల్లా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, నియోజకవర్గాల్లో చెర్వుకుంటల అక్రమ నిర్మాణాలు జాబితాను హైడ్రా అధికారులు సిద్దం చేస్తారు. రాజధాని తరువాత హైడ్రా ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా చెర్వు కుంటలు భూ కబ్జా చేసిన వారి వివరాలు హైడ్రా అధికారులు సేకరిస్తున్నారు.