Hydrogen Train : భారత్ లో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ ట్రైన్.. ఎక్కడో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా బోగ్గుతో కాకుండా వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాల ఉపయోగం ఇటీవల చాలా ప్రాముఖ్యత పొందుతున్నాయి. ప్రపంచ దేశాలు కాలుష్య రహిత వాతావరణం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంధనంతో ట్రైన్స్ ను వాడేందుకు ప్రపంచం సిద్ధంగా ఉంది. చాలా దేశాలు కూడా ఈ ఇంధనంతో నడిచే వాహనాలను ప్రమోట్ చేస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2023 | 04:27 PMLast Updated on: Oct 16, 2023 | 4:27 PM

Hydrogen Trains Are Going To Be Rolled Out In India In The Coming Days

భారత్ లో హైడ్రోజన్ రైళ్లు పరుగులు.. భారతదేశంలో రవాణా వ్యవస్థలో అత్యంత ఎక్కువ ప్రయాణికులు ఈ రైలు వ్యవస్థపై ఆధారపడి వారి గమ్యాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఇండియాలో బ్రిటిష్ కాలం నాటి నుంచి నేటి భవిష్యత్ కాలం లో ఉపయోగించే రైలు వ్యవస్థ కూడా పుష్కలంగా వినియోగిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో బొగ్గుతో నడిచే రైలు, ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. 2025-26 లోపు బుల్లెట్ ట్రైన్ కూడా భారత్ లో అందుబాటులోకి రానుంది. కానీ అంత కన్నా ముందు హైడ్రోజన్ ట్రైన్ ఇండియాలో పరుగులు పెట్టబోతోంది.. మరీ ఆది ఎక్కడో చూసేయండి.

ప్రపంచవ్యాప్తంగా బోగ్గుతో కాకుండా వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాల ఉపయోగం ఇటీవల చాలా ప్రాముఖ్యత పొందుతున్నాయి. ప్రపంచ దేశాలు కాలుష్య రహిత వాతావరణం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంధనంతో ట్రైన్స్ ను వాడేందుకు ప్రపంచం సిద్ధంగా ఉంది. చాలా దేశాలు కూడా ఈ ఇంధనంతో నడిచే వాహనాలను ప్రమోట్ చేస్తున్నాయి.

భారత్ లో పర్యావరణ సహితంగా వాతావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇథనాల్ వాహనాలను వాడుకలోకి తీసుకోస్తుంది భారత్ ఇందుకు గల ప్రయత్నాలు కూడా విజయవం అయ్యాయి. మరో కొన్ని రోజుల్లో అవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

మొదటి హైడ్రోజన్ రైలు..

ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైళ్లను తయారు జర్మనీ.. జర్మనీకి చెందిన “కోరాడియా ఐలాండ్” అనేది హైడ్రోజన్ శక్తితో ప్రత్యేకంగా నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు. దీనిని ఫ్రెంచ్ రైలు రవాణా సంస్థ అలోమ్ తయారు చేసింది. 2016లో దీని పరిచయం రైలు ఆధారిత హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అభివృద్ధిలో ఇది ఒక కీలక మలుపు. ఈ రైలు హైడ్రోజన్ ట్యాంక్కు దాదాపు 1,000 కిలోమీటర్లు నడుస్తుంది. ఇది మొదట సెప్టెంబర్ 2018లో జర్మనీలోని లోయర్ సాక్సోనీలో ట్రైయల్ రన్ నిర్వహించి, వాణిజ్యపరంగా ప్రవేశించింది. ఈ రైలు ఒకేసారి 140kmph వేగంతో 1000 కి.మీ. గమ్యం ను చేరుకుంటుంది.

ఆసియాలోనే మొదటి దేశం..

పర్యావరణం రక్షించాలనే ఉద్దేశంతో చైనా కూడా ఇటీవలే అర్బన్ రైల్వేలు.. హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను ప్రారంభించింది. చైనా నివేదికల ప్రకారం ఈ రైలు ఒకేసారి 140kmph వేగంతో 1000 కి.మీ. గామ్యంను చేరుకుంటుంది.

2023 డిసెంబర్ లో భారత్ లో పరుగులు..

చైనా తర్వాత ఆసియా ఖండంలో హైడ్రోజన్ ట్రైన్లను ఉపయోగించబోయేదు ఇండియానే.. ఇండియాలో
ఈ ట్రైన్ హర్యానాలోని సోనిపట్-జింద్ సెక్షన్‌లో టెస్ట్ రన్ అవుతుంది. డిసెంబర్ 2023 నుంచి హెరిటేజ్ మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

భారత్ లో ఎక్కడెక్కడ ఈ ట్రైన్ ను తిప్పబోతున్నారు..

నిజానికి ఉత్తర భారత్ లో ఎక్కు శాతం డీజిల్ తో నడిచే భారతీయ రైల్వేల వారసత్వ మార్గాలు ఇప్పటికి వినియోగంలో ఉన్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా సిమ్లా రైల్వే, మాథేరన్ హిల్ రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై, మార్వార్-దేవ్‌గర్ మద్రియా. కూడా ప్రకృతిలో ప్రయాణించే రైల్వే భారతీయ రైల్వే మార్గాలు. ఇవే నారో గేజ్ హెరిటేజ్ మార్గాలో విటిలో నుంచే ఎక్కువగా ప్రయాణాలు సాగిస్తారు. ‘మొదటిసారిగా, దేశీయ హైడ్రోజన్ తో నడిచే రైళ్లను డిసెంబర్ 2023 నాటికి దాని నారో గేజ్ హెరిటేజ్ మార్గాల్లో నడుస్తుందని, వాటిని “పూర్తిగా పచ్చగా” మారుస్తామని చెప్పాడు. చైనా, జర్మనీలో నడుస్తున్న రైళ్ల తరహాలోనే ఈ రైళ్లు ఉంటాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు’

హైడ్రోజన్ రైలు ఉపయోగాలు..

  • ఇది భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలు.
  • హైడ్రోజన్ స్థిరమైన ఇంధనం.
  • హైడ్రోజన్ రైలు అనేది విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన రైలు.
  • రైలు మొదటి నమూనాలో ఎనిమిది బోగీలు ఉంటాయి.
  • ఇది దాని ప్రొపల్షన్ సిస్టమ్ను శక్తివంతం చేయడానికి హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగిస్తుంది.
  • సాంప్రదాయ డీజిల్ తో నడిచే రైళ్ల కంటే పర్యావరణపరంగా మేలైనవి.
  • హైడ్రోజన్ రైలు పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి ఉద్గారాలను విడుదల చేయవు.
  • ఈ ట్రైన్స్ సాధారణ ట్రైన్ మాదిరి అధిక శబ్దం రాదు.
  • ఈ రైలు ఒకేసారి 140 kmph వేగంతో 1000 కి.మీ. గమ్యాన్ని చేరుకుంటుంది.

S.SURESH