JANASENA CAMPAIGN: స్టార్ వ్యూహం.. హైపర్ ఆది, గెటప్ శ్రీనుకు పవన్ కీలక బాధ్యతలు
క్రికెటర్ అంబటి రాయుడు, పవన్ సోదరడు నాగబాబు, డాన్స్ మాస్టర్ జానీ, మొగలిరేకులు ఫేం సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనుకు ఈ బాధ్యత అప్పగించారు. పార్టీ పెట్టినప్పటి నుంచీ నాగబాబు పవన్‌కు చేదోడువాదోడుగానే ఉంటున్నారు.
JANASENA CAMPAIGN: ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. తాను ప్రచారం నిర్వహిస్తూనే.. క్రౌడ్ పుల్లర్‌గా ఉపయోగపడే ప్రతీ ఒక్కరినీ ప్రచారంలో భాగస్వాములను చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. టీడీపీ, బీజేపీతో పొత్తు ఉన్నా.. సొంత వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ప్రచారం కోసం స్టార్ క్యాపెయినర్‌లను నియమించారు. సినీ క్రీడా ప్రముఖులతో లిస్ట్ రిలీజ్ చేశారు.
AAP minister Raaj Kumar: ఆప్ మంత్రి రాజీనామా.. కేజ్రీవాల్ పతనం మొదలైందా..?
క్రికెటర్ అంబటి రాయుడు, పవన్ సోదరడు నాగబాబు, డాన్స్ మాస్టర్ జానీ, మొగలిరేకులు ఫేం సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనుకు ఈ బాధ్యత అప్పగించారు. పార్టీ పెట్టినప్పటి నుంచీ నాగబాబు పవన్‌కు చేదోడువాదోడుగానే ఉంటున్నారు. మొదట వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు తరువాత జనసేనలో చేరారు. డాన్స్ మాస్టర్ జానీ కూడా పార్టీలో చేరినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తూనే ఉన్నారు. మొగలి రేకులు ఫేం సాగర్ కూడా రీసెంట్‌గా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చాలా కాలంగా జనసేన విజయం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. హైపర్ ఆది జనసేన విజయం కోసం పార్టీని ప్రజలకు దగ్గర చేయడం కోసం ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారో మీటింగ్స్‌లో కనిపిస్తూనే ఉంది. గెటప్ శ్రీను పార్టీలో లేకున్నా మెగా కుటుంబానికి చాలా విధేయుడు.
వీళ్లంతా స్టార్లు కావడమే కాకుండా రాజకీయాలకు అతీతంగా పవన్‌ను, మెగా కుటుంబాన్ని అభిమానించే వ్యక్తులు. అందుకే వీళ్లందరినీ ప్రచారంలో భాగం చేయాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. దానితో పాటే అన్ని నియోజకవర్గాలను కూడా కవర్ చేయాలి. దీంతో తాను వెళ్లలేని ప్రాంతాల్లో వీళ్లతో కీలక ప్రచారం చేయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వీళ్లు స్టార్ క్యాపెయినర్లుగా ఉంటారు అని జనసేన పార్టీ ప్రకటించింది. ఏ నియోజకవర్గాల్లో వీళ్లు పర్యటిస్తారు, కేవలం జనసేన అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేస్తారా లేక కూటమిలో ఉన్న అభ్యర్థులకు కూడా ప్రచారం చేస్తారా అనేది త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది.