నేను కేకేఆర్ మనిషిని, భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన రస్సెల్

ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్... ఇటు బీసీసీఐ నుంచి అటు ఫ్రాంచైజీల వరకూ... ఇటు ఆటగాళ్ళ నుంచి స్పాన్సర్ల వరకూ కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్ ఇది... ఇలాంటి టోర్నీలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ క్రికెటర్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2024 | 08:47 PMLast Updated on: Dec 03, 2024 | 8:47 PM

I Am A Kkr Man Says Russell After Rejecting Huge Offer

ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్… ఇటు బీసీసీఐ నుంచి అటు ఫ్రాంచైజీల వరకూ… ఇటు ఆటగాళ్ళ నుంచి స్పాన్సర్ల వరకూ కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్ ఇది… ఇలాంటి టోర్నీలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ క్రికెటర్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటాడు. డబ్బుకు డబ్బు… పేరుకు పేరు… లగ్జరీ లైఫ్… అందుకే విదేశీ ఆటగాళ్ళలో చాలా మంది తమ జాతీయ జట్టుకు గుడ్ బై చెప్పేసి మరీ ఐపీఎల్ లో కంటిన్యూ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆల్ రౌండర్లకు ఐపీఎల్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. మ్యాచ్ ను మలుపు తిప్పే ఆల్ రౌండర్లను తమ సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తుంటాయి. ఇటీవల మెగావేలానికి ముందు కొన్ని ఫ్రాంచైజీలు పలువురు ఆల్ రౌండర్లపై కన్నేసాయి. ముందే కొందరికి ఆఫర్ కూడా ఇచ్చేశాయి. కోల్ కత్తా విజయాల్లో కీలకంగా ఉన్న ఆండ్రూ రస్సెల్ కోసం ఒక ఫ్రాంచైజీ భారీ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది.

కోల్ కత్తా రిటెన్షన్ కు ఒప్పుకోకుండా వేలంలోకి వస్తే భారీ బిడ్ వేసి దక్కించుకుంటామని రస్సెల్ సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ ను రస్సెల్ మారుమాట లేకుండా తిరస్కరించాడు. ఆ ఫ్రాంచైజీ మరింత మొత్తం ఇస్తామని చెప్పినా కూడా రస్సెల్ ఒకే ఒక మాట చెప్పాడు. తాను ఎప్పటికీ కేకేఆర్ మనిషినంటూ ఖరాఖండీగా చెప్పేశాడు. డబ్బులు తనకు ప్రాధాన్యత కాదని, కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తాను వైఫల్యాల బాటలో ఉన్నప్పుడు కూడా అండగా నిలిచిందన్నాడు. అలాంటి ఫ్రాంచైజీకి లాయల్ గా ఉండడమే తనకు భారీ మొత్తం తీసుకున్నంత కిక్ వస్తుందని చెప్పాడు. ప్రముఖ క్రికెటర్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ లో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. విదేశీ క్రికెటర్లు కేవలం డబ్బు కోసమే ఆడతారన్న అభిప్రాయాన్ని రస్సెల్ మార్చేశాడని ప్రశంసిస్తున్నారు. 2014 సీజన్ నుంచి కోల్ కత్తా నైట్ రైడర్స్ కే ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ హిట్టర్ 126 మ్యాచ్ లలో 2491 పరుగులు చేశాడు. అలాగే బంతితోనూ రాణించి 116 వికెట్లు పడగొట్టాడు. ప్రతీ సీజన్ లో కోల్ కత్తాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడిన రస్సెల్ ను ఆ ఫ్రాంచైజీ 12 కోట్లకు రిటైన్ చేసుకుంది.