Ayodhya Rama Mandir : అతగాడి కారణంగా అయోధ్యకు వెళ్ళలేకపోయిన ఎన్టీఆర్!
అయోధ్యలో(Ayodhya) బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ(Prana pratishtha) కార్యక్రమానికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఆయన హాజరు కాకపోవడానికి పరోక్షంగా బాలీవుడ్ (Bollywood) యాక్టర్ (Actor) సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కారణమని తెలుస్తోంది.

I could not go to Ayodhya because of him NTR!
అయోధ్యలో(Ayodhya) బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ(Prana pratishtha) కార్యక్రమానికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఆయన హాజరు కాకపోవడానికి పరోక్షంగా బాలీవుడ్ (Bollywood) యాక్టర్ (Actor) సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కారణమని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ (Devara) సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్, సైఫ్ మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించాలని ముందుగానే ప్లాన్ చేశారు మేకర్స్. అందుకే అయోధ్య ఆహ్వానం అందినప్పటికీ.. సైఫ్ డేట్స్ వేస్ట్ అవుతాయని, షూటింగ్ వాయిదా వేస్తే నిర్మాతలపై భారం పడుతుందన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ అయోధ్యకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు.
పైగా వీలైనంత త్వరగా ‘దేవర’ను పూర్తి చేసి ‘వార్-2’ (War-2) షూట్ లో పాల్గొనాల్సి ఉంది. ‘దేవర’ ఆలస్యమయ్యే కొద్దీ ‘వార్-2’ నిర్మాతలపై కూడా భారం పడుతుంది. ఇవన్నీ ఆలోచించే తారక్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్టుగా.. ఎన్టీఆర్ ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. అనుకోకుండా సైఫ్ గాయాలతో ఆసుపత్రి పాలవ్వడంతో.. చివరి నిమిషంలో ‘దేవర’ షెడ్యూల్ వాయిదా పడింది. దీంతో అటు దేవర షూట్ లో పాల్గొనకుండా, ఇటు అయోధ్యకు వెళ్లకుండా అయిపోయింది.