Gautam Gambhir : నాకు రాజకీయాలు వద్దు.. బీజేపీకి గంభీర్ ఝలక్..
ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ (BJP) ఎంపీగా ఉన్న.. టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ గంభీర్(Gautam Gambhir).. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చాడు. త్వరలో స్టార్ట్ కాబోయే ఐపీఎల్‌లో కమిట్‌మెంట్లు ఉండడంతో... తనకు రాజకీయాల నుంచి బ్రేక్ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను గంభీర్ కోరాడు.

I don't want politics.. Gambhir Jhalak for BJP..
ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ (BJP) ఎంపీగా ఉన్న.. టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ గంభీర్(Gautam Gambhir).. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చాడు. త్వరలో స్టార్ట్ కాబోయే ఐపీఎల్‌లో కమిట్‌మెంట్లు ఉండడంతో… తనకు రాజకీయాల నుంచి బ్రేక్ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను గంభీర్ కోరాడు. దీంతో ఈసారి బీజేపీ ఎంపీ టికెట్ మరొకరికి కేటాయించే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన గంభీర్… ఆ తర్వాత ఎక్కువగా రాజకీయ కార్యకలాపాల్లో కనిపించలేదు. మరోవైపు రాజకీయాల కారణంగా క్రికెట్ కమిట్‌మెంట్ల విషయంలోనూ ప్రాబ్లమ్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పి.. ఐపీఎల్ (IPL) కమిట్‌మెంట్‌లు చూసుకోవాలని గంభీర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఐతే గంభీర్ నిర్ణయంపై మరో ప్రచారం జరుగుతోంది. ఈసారి టికెట్ వచ్చే చాన్స్ లేదని తెలిసే.. గంభీర్ ముందుగా తప్పుకున్నారని.. గౌరవంగా ఉంటుందని తానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశాడనే టాక్ వినిుపిస్తోంది. బీజేపీ సభ్యత్వానికి కూడా గంభీర్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్ హోదాలో గౌతం గంభీర్ కనిపించనున్నాడు.
గతంలోనూ లక్నో జెయింట్స్‌తో పాటు పలు జట్లకు ఆటగాడిగా, మెంటార్ సహా వివిధ హోదాల్లో గంభీర్ పనిచేశాడు. క్రికెట్ వర్గాల్లో గంభీర్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో తిరిగి ఐపీఎల్ పై దృష్టిసారించేందుకు సిద్ధం అవుతున్నాడు. బీజేపీ త్వరలో ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయబోతోంది. ఇందులోనే ఢిల్లీ ఈస్ట్ పేరు కూడా ఉండే చాన్స్ ఉంది.