నా స్టైల్ నాకుంది, కెప్టెన్సీపై బూమ్రా కామెంట్స్

ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి భారత్,ఆసీస్ తొలి టెస్ట్ మొదలుకాబోతోంది. ఈ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ బూమ్రా జట్టును నడిపించబోతున్నాడు. ఈ సారి రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లే కెప్టెన్ గా ఉండడం అరుదైన రికార్డుగా ఉండబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2024 | 04:44 PMLast Updated on: Nov 21, 2024 | 4:44 PM

I Have My Style Bumrah Comments On Captaincy

ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి భారత్,ఆసీస్ తొలి టెస్ట్ మొదలుకాబోతోంది. ఈ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ బూమ్రా జట్టును నడిపించబోతున్నాడు. ఈ సారి రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లే కెప్టెన్ గా ఉండడం అరుదైన రికార్డుగా ఉండబోతోంది. టీమిండియాకు బూమ్రా సారథిగా ఉంటే…ఆసీస్ కు కమ్మిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కెప్టెన్సీపై బూమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవమన్నాడు. అయితే కెప్టెన్సీ మార్క్ విషయంలో తన స్టైల్ తనకుందని వ్యాఖ్యానించాడు. ఎవరి నాయకత్వాన్ని తాను కాపీ కొట్టనంటూ కామెంట్ చేశాడు. పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని తాను ఎప్పుడూ సమర్థిస్తానని చెప్పాడు. వ్యూహాత్మకంగా పేసర్లు కెప్టెన్ అయితే జట్టుకు చాలా అడ్వాంటేజ్ అన్నాడు. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ అద్భుతమైన రీతిలో రాణిస్తున్నాడనీ, గతంలో కూడా చాలా మంది పేసర్లు కెప్టెన్లుగా సత్తా చాటారనీ బూమ్రా వ్యాఖ్యానించాడు.

ఆసీస్ తో సిరీస్ లో ఎదురయ్యే సవాళ్ళకు తాము సిద్ధంగా ఉన్నట్టు బూమ్రా చెప్పాడు. ఇక్కడికి జట్టు చాలా త్వరగానే వచ్చిందని, పరిస్థితులకు అలవాటు పడేందుకు అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. జట్టులోని చాలా మంది కుర్రాళ్లు తొలిసారి ఆసీస్ పర్యటనకు వచ్చారనీ, కానీ గతంలో తాము తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రస్తుత సమయం కంటే చాలా తక్కువ సమయం లభించిందని గుర్తు చేశాడు. అయినప్పటకీ చక్కని ప్రదర్శనతో గత సిరీస్ ను గెలిచామని ఈ స్టార్ పేసర్ వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం జట్టంతా పూర్తిస్థాయిలో సన్నద్ధమైందన్న బూమ్రా ఎక్కడ ఆడినా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకేలా ఉంటామని చెప్పాడు. ఈ సిరీస్‌లో తాము మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నట్టు చెప్పాడు.

ఇక కెప్టెన్సీ ఒత్తిడి గురించి కూడా బూమ్రా స్పందించాడు. కెప్టెన్‌గా.. బౌలర్‌గా తన బాధ్యతలను సమన్వయం చేసుకుంటానన్నాడు. అదనపు బాధ్యతలను ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసన్నాడు. ఇదిలా ఉంటే మహమ్మద్ షమీ జట్టులో భాగంగానే ఉన్నాడన్న బూమ్రా త్వరలోనే అతను ఆస్ట్రేలియా‌‌కు వచ్చే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ ప్రెస్ మీట్ లో బూమ్రా నవ్వులు పూయించాడు. ఓ రిపోర్టర్ బుమ్రాను మీడియమ్ పేస్ ఆల్‌రౌండర్ అని పిలవగా… తాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తానని చెబుతూ కౌంటర్ ఇచ్చాడు.