Bhatti Vikramarka : భట్టిని సీఎం చేస్తారనుకున్నా.. భార్య నందిని ఆవేదన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూశామని అంటున్నారు భట్టి సతీమణి నందిని. సీఎల్పీ లీడర్ గా రేవంత్ పేరు ప్రకటించాక.. ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మనస్థాపంతో అక్కడ ఉండలేకపోయానని అన్నారు. భట్టిని సీఎం సీటులో చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని చెప్పారు నందిని.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూశామని అంటున్నారు భట్టి సతీమణి నందిని. సీఎల్పీ లీడర్ గా రేవంత్ పేరు ప్రకటించాక.. ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మనస్థాపంతో అక్కడ ఉండలేకపోయానని అన్నారు. భట్టిని సీఎం సీటులో చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని చెప్పారు నందిని.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత.. ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తదితరులు బాగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పైరవీలు చేశారు. కానీ రేవంత్ నే సీఎం చేయాలని రాహుల్ గాంధీ గట్టిగా డిసైడ్ చేయడంతో.. ఎవరి పైరవీలు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర వర్కవుట్ కాలేదు. అయితే ఆ రోజు భట్టిని సీఎల్పీ లీడర్ గా అనౌన్స్ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ పేరు ప్రకటించగానే తాము ఎంతో మానసిక వ్యధకు గురయ్యామంటున్నారు భట్టి విక్రమార్క సతీమణి నందిని.
విజన్, కమిట్ మెంట్, అనుభవం ఉన్న నేత భట్టి అనీ.. పదేళ్ళుగా ఎంతో కష్టపడి కేడర్ ను కాపాడుకున్నామని చెప్పారు భట్టి భార్య నందిని. ఈసారి ముఖ్యమంత్రి అవుతారని కార్యకర్తలు కూడా బాగా కష్టపడ్డార. కానీ ఆయన్ని సీఎల్పీ నేతగా ప్రకటించకపోవడం బాధ కలిగించిందని చెప్పారు. రేవంత్ పేరు ప్రకటించడంతో.. ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయిందనీ.. అక్కడ ఉండలేక బయటకు వెళ్ళినట్టు చెప్పారు నందిని. తర్వాత మనసు కుదుట పర్చుకొని తిరిగి ఇంటికి వచ్చానన్నారు.
ఖమ్మంలో ప్యారాచూట్ నేతలను గెలిపించింది కూడా మా వాళ్ళే అని కామెంట్ చేశారు నందిని. వారికి మంత్రి పదవులు దక్కాయి. అంతకంటే ఎక్కువ ఆశించడం కరెక్ట్ కాదన్నారు. అధిష్టానానికి కొన్ని రూల్స్ ఉంటాయనీ.. దక్కిన వాటితో సంతోషించాలని పరోక్షంగా.. పొంగులేటి, తుమ్మలను ఉద్దేశించి అన్నారు నందిని. అయితే ఈసారి ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరపున నందిని కూడా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఖమ్మం జిల్లాకే చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడికి, తుమ్మల నాగేశ్వరరావు తన కొడుక్కి.. ఎంపీ టిక్కెట్ ఇప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు. అందుకే లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ లోకి వచ్చినందుకు పొంగులేటి, తుమ్మలకు మంత్రి పదవులు దక్కాయనీ.. ఇప్పుడు ఎంపీ టిక్కెట్లకు ప్రయత్నించడం కరెక్ట్ కాదంటూ పరోక్షంగా కామెంట్ చేశారు భట్టి భార్య నందిని.
ఖమ్మం ఎంపీగా నిలబడాలని ఇప్పటికే సోనియాగాంధీని కూడా రిక్వెస్ట్ చేశారు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ లీడర్లు. ఆమె పోటీ చేస్తారో లేదో తెలీదు గానీ.. కాంగ్రెస్ నుంచి మాత్రం ఆ సీటుపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన రేణుకా చౌదరితో పాటు తుమ్మల కొడుకు, పొంగులేటి తమ్ముడు.. భట్టి భార్య నందిని ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు.