నాకు కూడా చెప్పలేదు, అశ్విన్ రిటైర్మెంట్ పై జడేజా
ఈ ఏడాది భారత క్రికెట్ ను షాకింగ్ కు గురిచేసిన అంశాల్లో ఒకటి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సిరీస్ మధ్యలో అనూహ్యంగా అశ్విన్ ఆటకు వీడ్కోలు పలికేసాడు. ఒకవిధంగా ఇది అభిమానులకే కాదు మాజీ క్రికెటర్లకు అన్నింటికీ మించి సహచరులకు కూడా పెద్ద షాకే ఇచ్చింది.
ఈ ఏడాది భారత క్రికెట్ ను షాకింగ్ కు గురిచేసిన అంశాల్లో ఒకటి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సిరీస్ మధ్యలో అనూహ్యంగా అశ్విన్ ఆటకు వీడ్కోలు పలికేసాడు. ఒకవిధంగా ఇది అభిమానులకే కాదు మాజీ క్రికెటర్లకు అన్నింటికీ మించి సహచరులకు కూడా పెద్ద షాకే ఇచ్చింది. అశ్విన్ తో కలిసి ఎన్నో మ్యాచ్ లు ఆడిన జడేజా సైతం షాక్ కు గురయ్యాడు. అశ్విన్ నిర్ణయం జడేజాకు కూడా కొన్ని నిమిషాల ముందే తెలిసిందట. ఆ విషయాన్ని అతడు తాజాగా వెల్లడించాడు. రోజంతా కలిసే ఉన్నా రిటైర్మెంట్ గురించి అశ్విన్ తనకు హింట్ కూడా ఇవ్వలేదని చెప్పాడు. మీడియా సమావేశానికి ఐదు నిమిషాల ముందే తనకు తెలిసిందన్నాడు. ఇది తనకు షాకింగ్‍గా అనిపించిందనీ వ్యాఖ్యానించాడు. అశ్విన్ ఎలా ఆలోచిస్తాడో మనందరికి తెలుసు కదా అంటూ జడేజా మీడియాతో చెప్పాడు.
అశ్విన్, జడేజా స్పిన్ జోడీ చాలా మ్యాచ్‍ల్లో ఇండియాను గెలిపించింది. ఇద్దరూ కలిసి 58 టెస్టులు అడగా.. 587 వికెట్లను జంటగా తీసుకున్నారు. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ రికార్డును దాటేసి.. సక్సెస్ ఫుల్ భారత స్పిన్ జోడీగా నిలిచారు. ఇదిలా ఉంటే అశ్విన్ తనకు ఆన్‍ఫీల్డ్ మెంటార్‌లా అని రవీంద్ర జడేజా చెప్పాడు. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉంది, బ్యాటర్లు ఏం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు లాంటి అంశాలను మేం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమని గుర్తు చేసుకున్నాు. తాను అతడిని చాలా మిస్ అవుతానంటూ జడేజా వ్యాఖ్యానించాడు. ఇక అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదని జడేజా అభిప్రాయపడ్డాడు. అయితే యువకులకు ఇదో మంచి అవకాశంగా అభివర్ణించాడు.
మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో మ్యాచ్ లో జడేజా ఆకట్టుకున్నాడు. బంతితో పెద్ద ప్రభావం చూపకున్నా బ్యాటింగ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్ లో హాఫ్ సెంచరీతో జట్టును ఫాలో ఆన్ నుంచి తప్పించడంలో తాను కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇరు జట్లు మధ్య నాలుగో టెస్టు మెల్‍బోర్న్ వేదికగా డిసెంబర్ 26వ తేదీన మొదలుకానుంది. ఇప్పటికే మెల్‍బోర్న్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ ఆశలు నిలువాలంటే భారత్‍కు ఈ మ్యాచ్ విజయం కీలకం కానుంది.