IAS Smita Sabharwal : గొంతు వణికినా నిజమే మాట్లాడతా.. స్మిత.. నువ్ మారవా తల్లీ..
ఐఏఎస్ స్మితా సబర్వాల్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ.. స్మిత చేసిన పోస్ట్ తీవ్ర వివాదంగా మారింది. దివ్యాంగులకు ఐఏఎస్ పోస్టులు అవసరమా అని ప్రశ్నిస్తూ ఆమె రాసుకొచ్చిన రాతలు.. ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ.. స్మిత చేసిన పోస్ట్ తీవ్ర వివాదంగా మారింది. దివ్యాంగులకు ఐఏఎస్ పోస్టులు అవసరమా అని ప్రశ్నిస్తూ ఆమె రాసుకొచ్చిన రాతలు.. ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. స్మితకు బుర్ర లేదా.. పోయిందా అని కొందరు బహిరంగంగానే ఘాటు విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కతో సహా.. చాలామంది రాజకీయ నేతలు.. స్మిత తీరుపై దుమ్ము దులిపారు.
ఇక అటు తోటి ఐఏఎస్‌లు కూడా స్మిత విషయంలో సైలెంట్‌గా ఉంటేనే బెటర్ అని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇక అటు దివ్యాంగుల సంఘాలు కోర్టు మెట్లెక్కాయ్. స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయ్. ఇంత రచ్చ జరుగుతున్నా.. స్మిత మాత్రం తగ్గేదే లే అన్నట్లు కనిపిస్తోంది. స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్ చేశారు. కెరీర్ పబ్లిక్‌లో పుట్టినా.. క్యారెక్టర్, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోవచ్చు.. స్వరం వణుకుతున్న నిజాన్నే మాట్లాడండి అంటూ స్మితా ట్వీట్ చేశారు. అయితే తన వ్యాఖ్యలపై జరుగుతున్న వివాదంతోనే.. స్మితా సబర్వాల్ ఈ ట్వీట్ చేశారనే చర్చ జరుగుతోంది. దివ్యాంగుల రిజర్వేషన్‌పై వరుసగా విమర్శలు వస్తున్నా… ఈ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు.
ఇప్పుడు పెట్టిన ట్వీట్.. ఈ వివాదం గురించే అయితే.. తను అడిగిన ప్రశ్నలో తప్పే లేదు అని స్మితా మరోసారి చెప్పినట్లే అని అర్థం. ప్రతీసారి స్మితా సబర్వాల్.. వివాదాలకు కేరాఫ్‌గానే నిలుస్తుటారు. తెలంగాణలో ప్రభుత్వం మారాక.. కొత్త సీఎంతో మీటింగ్ హాజరుకాలేదు. ఇక మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలేసుకొని కూర్చొని మరోసారి విమర్శలకు కారణం అయ్యారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. ఫీల్డ్ విజిట్ కోసం హెలికాప్టర్‌లో వెళ్లి మరిన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడేమో సడెన్‌గా సివిల్స్ పరీక్షలు.. దివ్యాంగుల కోటా మీద పడ్డారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.