ICAI CA ఫైనల్, ఇంటర్ ఫలితాలు వెల్లడి

సీఏ ఫైనల్, ఇంటర్ రిజల్ట్స్ ను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. అభ్యర్థులు icai.nic.in లో రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ తో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు మెరిట్ లిస్ట్, టాపర్స్ ఎవరనే పేర్లు కూడా వెల్లడి అవుతాయి.
ICAI CA ఇంటర్ గ్రూప్ 1 పరీక్షలు మే 3,5, 9 తేదీల్లో జరిగాయి. గ్రూప్ 2 పరీక్షలు మే 11,15, 17 తేదీల్లో జరిగాయి. అలాగే CA ఫైనల్ గ్రూప్ 1 పరీక్షలు మే 2,4,8 తేదీల్లో జరిగాయి. గ్రూప్ 2 పరీక్షలు మే 10,14, 16 తేదీల్లోజరిగాయి. International Taxation Assessment పరీక్ష మే 14,16 తేదీల్లో జరిగింది.