ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఏబీడీ, కుక్, నీతూలకు చోటు
సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివీలియర్స్ , ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ , భారత దిగ్గజ స్పిన్నర్ నీతూ డేవిడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు.
సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివీలియర్స్ , ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ , భారత దిగ్గజ స్పిన్నర్ నీతూ డేవిడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు. మిస్టర్ 360 ప్లేయర్ గా పేరున్న డివీలియర్స్ సౌతాఫ్రికా తరఫున 114 టెస్ట్‌లు, 228 వన్డేలు, 78 టీ20 ఆడాడు. మరోవైపు ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా అలెస్టర్ కుక్ కు పేరుంది. కుక్ 161 టెస్ట్‌లు , 92 వన్డేలు , 4 టీ ట్వంటీలు ఆడాడు. ఇక నీతూ డేవిడ్ భారత్ తరఫున ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమ్ జాబితాలో చేరిన రెండో మహిళా క్రికెటర్. నీతూ డేవిడ్ భారత్ తరఫున 10 టెస్ట్‌లు, 97 వన్డేలు ఆడి 182 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ గా ఘనత సాధించింది.