ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్, బౌలింగ్ లో బూమ్రానే టాప్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. పెర్త్ టెస్టులో అద్భుతంగా రాణించిన బూమ్రా 883 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. పెర్త్ టెస్టులో కెప్టెన్ గా వ్యవహరించిన ఈ స్టార్ పేసర్ 8 వికెట్లు పడగొట్టాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2024 | 03:06 PMLast Updated on: Dec 05, 2024 | 3:06 PM

Icc Test Rankings Bumrah Tops Bowling Charts

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. పెర్త్ టెస్టులో అద్భుతంగా రాణించిన బూమ్రా 883 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. పెర్త్ టెస్టులో కెప్టెన్ గా వ్యవహరించిన ఈ స్టార్ పేసర్ 8 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మరో ఇద్దరు భారత బౌలర్లు టాప్ టెన్ లో కొనసాగుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో నిలవగా… రవీంద్ర జడేజా ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంకులో ఉన్నాడు. టెస్టు బౌలర్లు, ఆల్ రౌండర్ల జాబితాలో మార్కో యాన్సెన్ దూసుకెళ్లాడు. బౌలర్ల జాబితాలో 19 స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకులో నిలిస్తే.. ఆల్ రౌండర్ల జాబితాలో పదిస్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో అశ్విన్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు. అలాగే మరో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఆరో ర్యాంకులో నిలిచాడు.

బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మాత్రం భారత్ బ్యాటర్లు వెనుకబడ్డారు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారాడు. పెర్త్ టెస్టులో సెంచరీ తర్వాత రెండో స్థానానికి చేరిన అతడు.. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేసి రెండో స్థానానికి ఎగబాకాడు. జో రూట్ తొలి స్థానంలో, కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నారు.టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఒక స్థానం దిగజారి 14వ స్థానానికి పడిపోయాడు. పెర్త్ టెస్టులో కోహ్లీ సెంచరీ చేసినప్పటకీ ర్యాంకింగ్స్ లో మాత్రం దిగజారాడు. కాగా ఈ సిరీస్ లో కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తే మళ్ళీ టాప్ టెన్ లోకి వచ్చేసే అవకాశముంది. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరో స్థానంలోనే ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ 18, రోహిత్ శర్మ 26వ స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే టీమ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా… టీమిండియా సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.