World cup 2023: పాకిస్థాన్ ఓటమికి తిండే కారణం.. రోజుకు 8 కేజీల మటన్ తింటున్నారు!
క్రికెట్‌లో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ మరోసారి అదే నిజమని ప్రూవ్ చేసుకుంటోంది. వరుస పెట్టి మ్యాచ్‌లు ఓడిపోతుండడంతో ఈ ఓటములకు మటన్ తినడమే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

icc world cup 2023 8 kg of goat meat everyday is the reason behind pakistan cricket failures
వరుసగా రెండు ఘన విజయాలు.. వెంటనే వరుసపెట్టి మూడు ఘోర పరాజయాలు.. మొదటి రెండు మ్యాచ్‌లకు.. తర్వాతి మూడు మ్యాచ్‌లకు ఆటతీరులో అసలు పోలికే లేదు. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జట్టు ఆట అంతుబట్టడం లేదు. ఒక మ్యాచ్‌లో ఇరగదీసిన వాళ్లు తర్వాతి మ్యాచ్‌లో బొక్కబోర్లా పడుతున్నారు. ఇండియాతో జరిగిన మ్యాచ్ నుంచి మొదలైన పాకిస్థాన్ ఓటములు తర్వాత ఆస్ట్రేలియాతో పాటు అఫ్ఘాన్‌తో ఓడే వరకు వచ్చింది. క్రికెట్‌లో పసికూనలగా ఉన్న అఫ్ఘానిస్థాన్‌తో పాక్ ఓటమి ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. అదే సమయంలో మాజీలకు తీవ్ర కోపం తెప్పించింది.
పాక్ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవల్స్‌పై లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ ఫైర్ అయ్యాడు. పాకిస్థాన్ ఓటములకు ఘోరమన ఫీల్డింగే కారణమని మండిపడ్డాడు. ఫీల్డింగ్ కరెక్ట్‌గా చేయాలంటే ఫిట్‌నెస్ బాగుండాలని.. పాక్ ప్లేయర్ల ఫిట్‌నెస్ చూస్తుంటే రోజుకు 8 కేజీల మటన్ తింటున్నట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వసీం అక్రమ్ వ్యాఖ్యలను క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ సమర్థిస్తున్నారు. ఇంత ఘోరంగా ఫిట్‌నెస్ ఉంటే అసలు ఆటగాళ్లు గ్రౌండ్‌లో చురుగ్గా ఎలా ఉండగలరని ప్రశ్నిస్తున్నారు. వసీం చెప్పింది ముమ్మాటికి నిజమేనంటున్నారు.
మరోవైపు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. బాబర్ కెప్టెన్సీ వైఫల్యాల వల్లే జట్టు ఈ స్థితిలో ఉందని అఫ్రిది లాంటి మాజీ ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. అటు షోయబ్ మాలిక్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బాబర్ స్థానంలో కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇదంతా షాహిన్ అఫ్రిది కోసమే ఇలా బాబర్‌ను టార్గెట్ చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. పాకిస్థాన్‌కు టీ20 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ బాబర్. అటు వన్డేల్లో టాప్ ర్యాంక్‌కు పాక్ చేరుకున్నదంటే అది బాబర్ కెప్టెన్సీ వల్లే. అదే సమయంలో ఇటు బ్యాటర్‌గానూ బాబర్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 పొజిషన్‌లో ఉన్నాడు. జట్టు వైఫల్యాలకు కేవలం బాబర్‌ని బాధ్యుడిని చేయడం సరికాదు.