Pushpa2 : రికార్డుల రారాజు…
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) కి తెలుగులో కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉందా! సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరు ఇప్పుడు ఇదే మాట అనుకుంటున్నారు.

Icon star Allu Arjun will create a song record from Pushpa 2
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) కి తెలుగులో కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉందా! సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరు ఇప్పుడు ఇదే మాట అనుకుంటున్నారు. నిజానికి మన తెలుగు హీరోల్లో చాలా మందికి నార్త్ లో క్రేజ్ ఉంది. అది నిజమని ప్రూవ్ చేస్తు రికార్డు కలెక్షన్స్ తో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పడు బన్నీ అంతకు మించి సత్తా చాటాడు.
రీసెంట్ గా పుష్ప 2 (Pushpa 2) నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అన్ని చోట్ల మంచి వ్యూస్ ని సాధిస్తు ముందుకు దూసుకెళ్తుంది. ఇక హిందీ ప్రేక్షకులు అయితే మేము పుష్ప 2 సాంగ్ (Pushpa 2 Song) కోసమే ఎదురుచూస్తున్నాం అన్నట్టుగా ఒక సరికొత్త రికార్డుని బన్నీకి ఇచ్చారు. 14 గంటల్లో 77లక్షల మంది పుష్ప 2 ఫస్ట్ సాంగ్ ని వీక్షించారు. తెలుగు ప్రేక్షకులు 57 లక్షలు మంది వీక్షించారు. దీన్ని బట్టి నార్త్ ఆడియెన్స్ లో బన్నీ రూల్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.పైగా లైక్స్ కూడా హిందీ వెర్షన్ కే ఎక్కువ వచ్చాయి.
ఇక ఈ న్యూస్ తో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. ముందు ముందు మా బన్నీ రికార్డుల రారాజు గా మారడం ఖాయమని అంటున్నారు. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 అగస్ట్ 15 న విడుదల కానుంది. బన్నీ సరసన రష్మిక జోడి కట్టగా అనసూయ, సునీల్, ఫాహద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా సుకుమార్ దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.