Shah Rukh Khan : జవాన్ కి బన్నీకి ఏంటి లింకు..?
జవాన్ బ్లాక్ బస్టర్ కావాలని షారుఖ్ కంటే కూడా ఎక్కువగా బన్నీనే కోరుకుంటున్నాడట. ఎందుకో తెలుసా..?

Icon star Allu Arjuna swept pan India as Pushpa With Pushpa 2 he will also hit another blockbuster It is said that during the time when everything was going well Bunny got scared
జవాన్ రిజల్ట్ తో అల్లు అర్జున్ మూవీకి లింకుందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న పుష్పగా పాన్ ఇండియాను ఊపేశాడు. పుష్ప 2 తో కూడా పక్కగా మరో బ్లాక్ బస్టర్ కొడతాడు.. అంతా బానే ఉందనుకున్న టైంలో బన్నీ కి భయం పెరిగిందంటున్నారు. దానికి కారణం ఉంది. ఆ రీజన్ వెనక జవాన్ తో లింకుంది.
పుష్ప 2 తర్వాత ఏంటనే ప్రశ్నే బన్నీని భయపెడుతోందా?
ముందుగా పుష్ప 2 తర్వాత ఏంటనే ప్రశ్నకి బన్నీ దగ్గర సమాధానం లేదట. త్రివిక్రమ్ తో పాన్ ఇండియా ఫ్యామిలీ డ్రామాని, బోయపాటితో పాన్ ఇండియా ఊరమాస్ డ్రామాని ప్లాన్ చేసుకున్న బన్నీకి ఇది సరైన నిర్ణయమో కాదో తేల లేనట్టుంది.
మూవీ యూట్యూబ్ లో ఫీ.. థియేటర్స్ లో కాదు..
బోయపాటి సరైనోడు యూట్యూబ్ లో హిందీవర్షన్ దుమ్ముదులిపింది. త్రివిక్రమ్ తో బన్నీచేసిన ప్రతీ మూవీ హిందీ డబ్బింగ్ లో అది కూడా యూట్యూబ్ లోనే ఆడింది. అలాని చెప్పి వీళ్లతో పాన్ ఇండియా డ్రామాలు తీస్తే థియేటర్స్ లో ఆడుతాయనలేం. ఎందుకంటే యూట్యూబ్ లో సినిమా ఫ్రీ.. థియేటర్స్ లో మూవీ ఫ్రీ కాదు..
జవాన్ హిట్ ని షారుఖ్ కంటే ఎక్కువగా కోరుకుంటున్న బన్నీ
అందుకే డౌట్ వచ్చి స్పిరిట్ మూవీ ప్లాన్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగని తొందరపెట్టి ఓ మూవీ ప్లాన్ చేశాడు. ఇప్పడు షారుఖ్ మూవీ జవాన్ తీసిన దర్శకుడు ఆట్లీమీద హోప్స్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఆట్లీ బన్నీకి ఎప్పుడో కథ చెప్పాడు. సో తనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో లేదో జవాన్ రిజల్ట్ ని బట్టి చూద్దాం అనుకుంటున్నాడు బన్నీ. ఒకవేల జవాన్ పాన్ ఇండియాలెవల్లో దుమ్ముదులిపేస్తే, ఆతర్వాత తన మేకింగ్ లో బన్నీమూవీ ఓకే అయితే, ఆటో మేటిగ్గా నార్త్ నుంచి సౌత్ వరకు తన సినిమా సేఫ్ జోన్ లో ఉంటుంది. అందుకే జవాన్ బ్లాక్ బస్టర్ కావాలని షారుఖ్ కంటే కూడా ఎక్కువగా బన్నీనే కోరుకుంటున్నాడట.