రోహిత్ స్కూల్ మూసేయి
ఎంత పెద్ద ప్లేయర్ కైనా ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుంది... కానీ అదే బ్యాడ్ ఫేజ్ కాస్త ఎక్కువ రోజులు నడిస్తే మాత్రం ఆటకు గుడ్ బై చెప్పేందుకు టైమ్ దగ్గర పడినట్టే... ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ ఇదే సిచ్యువేషన్ లో ఉన్నాడు...
ఎంత పెద్ద ప్లేయర్ కైనా ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుంది… కానీ అదే బ్యాడ్ ఫేజ్ కాస్త ఎక్కువ రోజులు నడిస్తే మాత్రం ఆటకు గుడ్ బై చెప్పేందుకు టైమ్ దగ్గర పడినట్టే… ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ ఇదే సిచ్యువేషన్ లో ఉన్నాడు… చాలా కాలంగా రోహిత్ ఆట ఏమాత్రం స్థాయికి తగినట్టు లేదు… ఈ ఏడాది టీ ట్వంటీ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన హిట్ మ్యాన్ టెస్టులు, వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నాడు. కానీ ఈ రెండు ఫార్మాట్ లోనూ రోహిత్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడి దాదాపు ఏడాది దాటిపోయింది. ఒకవిధంగా చెప్పాలంటే 2024లో అత్యంత పేలవ ఫామ్ లో ఉన్నాడు మన హిట్ మ్యాన్… అతని బ్యాటింగ్ స్కిల్స్ ను ఎప్పటికీ తప్పుపట్టలేదు.. వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీ కొట్టిన మొనగాడు… ఎటువంటి బాల్ నైనా స్టాండ్స్ లోకి అలవోకగా పంపే సత్తా ఉన్నోడు… కానీ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడేటప్పుడు రికార్డులు ఎప్పుడూ వెనుకే ఉంటాయి… వరుసగా కొన్ని ఇన్నింగ్స్ లలో ఫ్లాప్ అయితే గత రికార్డులను ఎవ్వరూ పట్టించుకోరు.. ప్రస్తుతం ఎలా ఆడుతున్నారు అనేదే చూస్తారు… ఈ విషయం రోహిత్ కు కూడా తెలుసు…
టెస్ట్ ఫార్మాట్ లో రోహిత్ శర్మ రికార్డు ఏమాతం ఘనంగా లేదు…వన్డేలతో పోలిస్తే అందులో సగం రన్స్ కూడా కొట్టలేకపోయాడు…పైగా గత ఏడాదిన్నర కాలంగా ఒక్కటి కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ లేదు. 14 టెస్టుల్లో 25 ఇన్నింగ్స్ లు ఆడిన హిట్ మ్యాన్ 25 యావరేజ్ తో 610 పరుగులు చేశాడు. నిజానికి ఈ గణాంకాలు రోహిత్ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి..సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఆ సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. గత 15 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేశాడు. ఆసీస్ పర్యటనలో తొలి టెస్ట్‌కు రోహిత్ దూరంగా ఉండగా.. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచ్‌కు అతను అందుబాటులోకి రాగా.. భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ 3, 6 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. మూడో టెస్ట్‌లో 10 పరుగులే చేసిన రోహిత్.. తాజా మ్యాచ్‌లో3, 9 రన్సే చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు టైమ్ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఆస్ట్రేలియా 11వ బ్యాటర్ స్కాట్ బోలాండ్ ఈ మ్యాచ్‌లో 101 బంతులను ఎదుర్కొంటే, ఈ సిరీస్ మొత్తంలో రోహిత్ శర్మ ఫేస్ చేసింది 70 బంతులే.. ఈ ఏడాది టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడం రోహిత్ శర్మకు ఇది ఐదోసారి. రోహిత్ శర్మ ఫెయిల్యూర్‌తో అతని టెస్టు కెరీర్ ఇక్కడితో ముగిసిందని, టెస్టు ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ఇచ్చినట్టేనని టీమిండియా అభిమానులు Happy retirement rohit హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు . రోహిత్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసినట్టుగా ఓ ఫేక్ స్టేట్‌మెంట్ కూడా వైరల్ చేస్తున్నారు.
సిడ్నీలో రోహిత్ శర్మకు చెప్పుకోదగ్గ రికార్డు లేదు. ఆఖరి టెస్టులో రోహిత్ ఆడితే, అది టీమిండియాకే నష్టమని, అతను ఇక్కడితో టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే మంచిదంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ టెస్టు మ్యాచ్ ఓడితే, రోహిత్ శర్మను రిటైర్మెంట్ తీసుకోవాల్సిందిగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కోరినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక హిట్ మ్యాన్ ఆటతీరుపై మాజీల నుంచో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పుడు నెటిజన్స్ కూడా రోహిత్ ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వాలని తన స్థానంలో యంగ్ ప్లేయర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టింట వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసీస్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే చివరి టెస్టులోనైనా సెంచరీ చేసి కెరీర్ ను ఘనంగా ముగిస్తే మరింత బావుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.