గాడిదలకు పెళ్లి చేస్తే వర్షం పడుతుందా…?
ఇప్పుడు వర్షం అనే మాట వింటేనే తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వరదల దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు జిల్లాలు నరకం చూసాయి.
ఇప్పుడు వర్షం అనే మాట వింటేనే తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వరదల దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు జిల్లాలు నరకం చూసాయి. అలాంటిది ఓ జిల్లాలో మాత్రం వర్షాల కురవాలని గాడిదలకు పెళ్లి చేసారు ఓ గ్రామంలో. సత్యసాయి జిల్లాలోని తలుపుల మండల కేంద్రంలో వర్షాలు పడాలని గాడిదలకు పెళ్లి చేసారు గ్రామస్తులు. గాడిదలను గ్రామంలో ఊరేగించి… ఆలయం ముందు పెళ్లి చేసారు.
ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం… వర్షం కోసం గాడిదలకు పెళ్లి చేశామని గ్రామస్తులు చెప్తున్నారు. వర్షాలు కురవక పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని… గాడిదల పెళ్ళితో వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిస్తే ఎండిపోయిన పంటలు తిరిగి ప్రాణం పోసుకుంటాయని గ్రామస్తులు నమ్ముతున్నారు.