Telugudesam: జనసేన టీడీపీ పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు?
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ అనే దానిపై చర్చ జరుగుతోంది.
ఏపీ పాలిటిక్స్‌లో పొత్తుల విషయంలో చాలా రోజుల నుంచి కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ప్రభుత్వం ఓట్ బ్యాంక్‌ను చీలిపోనివ్వనంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. వైసీపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలసి రావాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీని ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ బీజేపీ మాత్రం టీడీపీ పొత్తుకు నో చెప్పింది. ఐతే జనసేనతో పోటీ చేస్తాం. లేదంటే ఒంటరిగా పోటీ చేస్తాం.. అంతే తప్ప టీడీపీతో కలిసి వెళ్లేది లేదంటూ తెగేసి చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రెండు పార్టీలను కలిపే ప్రయత్నం చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా చంద్రబాబు అరెస్ట్‌తో ఈ చిక్కుముడికి ముగింపు పలికారు పవన్ కళ్యాణ్. చంద్రబాబుతో ములాఖత్ అయిన వెంటనే తాము టీడీపీతో కలిసి పోటీ చేస్తామంటూ ప్రకటించారు.
ఈ విషయంలో కొంత సానుకూలత కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ అందరి మైండ్‌లో ఇప్పుడున్న ప్రశ్న.. ఈ పొత్తులో సీఎం క్యాండెట్ ఎవరు అని. పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనేది జనసైనికులు ఆకాంక్ష. చంద్రబాబును మరోసారి సీఎంగా చూడాలి అనేది టీడీపీ కార్యకర్తల కోరిక. ఇప్పుడు వీళ్లిద్దరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితే సీఎం కుర్చీలో ఎవరు కూర్చుంటారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎవరు సీఎం అవ్వాలి అనేది మెజార్టిని బట్టి ఉంటుందని.. జనసేనకు ఎక్కువ మెజార్టీ ఎమ్మెల్యేలను ఇస్తే ఖచ్చితంగా తానే సీఎం అవుతానంటూ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా చెప్పారు. సీఎం పదవిపై తనకు ఆశ లేదంటూ చంద్రబాబు కూడా రీసెంట్‌గా చెప్పారు. పొలిటికల్‌గా పవన్ ఇమేజ్ కూడా గత ఎన్నికలతో కంపేర్ చేస్తూ ఈసారి భారీగా పెరిగింది.
గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ ఆ తరువాత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఒంటిరిగా పోటీ చేసి గెలవలేకపోయినా.. ఏపీ రాజకీయాలను శాసించే కింగ్ మేకర్‌గా జనసేన పార్టీ ఉండబోతోంది అనేది అందరి విశ్లేషణ. ఇప్పుడు అదే నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన ఎక్కడ సీట్లు అడిగినా, ఆఖరికి సీఎం సీటు అడిగా ఇవ్వాల్సిన పరిస్థితి టీడీపీది. ఆ పార్టీలో ఉన్న కొందరికి ఇది నచ్చకపోయినా ఇదే నిజం. దీంతో ఏ రకంగా చూసినా.. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడితే పవన్ సీఎం అవుతారనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే జనసైనికులు కోరిక తీరినట్టే.