India As Bharath: ఇండియా కాస్త భారత్ గా మారితే సామాన్యుడికే ఎన్ని కష్టాలో తెలుసా..?

ఎన్నో దశాబ్ధాలుగా ఉన్న మన దేశం పేరును భారత్ గా మార్చడం వల్ల దేశంలోని సామాన్యుడి నుంచి పెద్ద సంస్థల వరకూ అందరూ చాలా రకాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 8, 2023 | 10:23 AMLast Updated on: Sep 08, 2023 | 10:23 AM

If The Name India Is Changed To Bharat The Common Man Will Face Difficulties

ఇండియా ఈ మూడు అక్షరాలే ఇప్పడు దేశం మొత్తం హట్ టాపిక్ గా మారిపోయింది. ఇండియా అనే పేరు ఇండస్ అనే ప్రాంతంలోని సింధూ నది నుంచి ఉద్భవించింది. దీనిని క్రమక్రమంగా ఇండియాగా పిలువడం జరిగింది. దాదాపు కొన్ని దశాబ్ధాలుగా ఇలా పిలుస్తున్న దేశాన్ని భారత్ గా మర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే మన రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం. అయితే ఇండియా అనే పేరును భారత్ అనే పేరుగా మార్చడంలో తప్పేముంది.. మారుస్తే పోతుంది కదా.. దీనికి ఇంత పెద్ద చర్చ ఎందుకు అనే అనుమానాలు మీలో కలుగవచ్చు. ఇలాంటి సందేహాలకు సరైన సమాధానాన్ని ఇప్పుడు చదివేయండి.

నోట్లరద్దు కంటే మించిన సమస్యలు..

ముందుగా మనం ఏ పనిచేయాలన్నా చేతిలో ముఖ్యంగా ఉండాల్సింది డబ్బులు. ఆ డబ్బుల పై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంటుంది. ఇండియా కాస్త భారత్ గా మారిపోతే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించాలి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ అని మారాలి. దీంతో కరెన్సీ మొత్తం మార్చేయాల్సి వస్తుంది. మన దేశంలో పాత కరెన్సీని వాడకంలోకి తెచ్చినా విదేశాల్లో మన డబ్బులను డాలర్లుగా, యూరోలుగా, పౌండ్లుగా, రియాల్ గా మార్చేందుకు వీలుపడదు. గతంలో నోట్ల రద్దు విష‍యంలో కేవలం 500, 1000 నోట్లను కొత్తగా మారిస్తేనే ఎంత ఖర్చుతో కూడుకుందో మనకు తెలిసిన విష‍యమే. పైగా పాత నోట్లు బ్యాంకులో చెల్లించి కొత్తరకం నోట్లకోసం మళ్లీ బ్యాంకులకు పరుగులు తీయాల్సి ఉంటుంది. అలాగే వాహన నంబర్ ప్లేట్లు, ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్లు, పాస్ పోర్ట్, ఆధార్ తో పాటూ అన్నింటినీ మార్చేయాల్సి వస్తుంది. ఇలా ఒక్కరు తీసుకున్న నిర్ణయానికి యావత్ దేశంలోని ప్రజలంతా సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది.

ఆర్థిక, సాంకేతిక సమస్యలు..

అంతేకాకుండా నేటి యుగం మొత్తం డిజిటలైజేషన్ లో భాగమైపోయింది. ఇండియా డొమైన్ తో నడిచే వెబ్ సైట్ల అడ్రస్ లను డాట్ ఇన్ బదులు వేరే దానిని చేర్చాలి. అలా మార్చే క్రమంలో సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన ప్రభుత్వ సైట్లు అన్నీ డాట్ ఇన్ తో నడుస్తూ ఉంటాయి. వీటిని మార్చే క్రమంలో ఏవైనా సాంకేతిక లోపం తలెత్తితే అందులోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల కు చిక్కే అవకాశం ఉంది. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ భారత్ గా మారాల్సి వస్తుంది. ఇలా ఇండియా అని ఉన్న ప్రతి చోట భారత్ అని రావాలి. అప్పుడే మన దేశానికి, కరెన్సీకి, సేవలకు గుర్తింపు లభిస్తుంది. లేకుంటే లేని పోని తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి ఇండియాను భారత్ గా మార్చాల్సిన అవసరం ఏముందని కొందరు తీవ్రంగా విమర్శిస్తుంటే.. ఇండియా అనేది బ్రిటీప్ వాళ్ళు పెట్టిన పేరు అందుకే దీనిని తొలగించి భారత్ గా మారుస్తున్నామంటున్నారు నాయకులు.

T.V.SRIKAR