SUNITHA : సమస్య వస్తే చెప్పండి.. పరిష్కారం చూపిస్తానన్న సునీత
ఏ సమస్య వచ్చినా నాతో చెప్పుకోండి... నెనెప్పుడూ మీకు అందుబాటులో ఉంటా అంటున్నారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి.

If there is a problem, tell me.. I will show you the solution, Sunita
ఏ సమస్య వచ్చినా నాతో చెప్పుకోండి… నెనెప్పుడూ మీకు అందుబాటులో ఉంటా అంటున్నారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకూ వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు LB నగర్ లో AICC వైస్ ప్రెసిడెంట్ అనిల్ థామస్ తో కలసి హోసన్న చర్చ్ ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత మెహదీపట్నంలోనూ చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
మధ్యాహ్నం మేడ్చల్ లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన బీసీ ఐక్యతా సమ్మేళనంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం మూడు చింతలపల్లి మండలంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందనీ… పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే… నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు సునీత మహేందర్ రెడ్డి
శామీర్ పేట్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర ప్రచారం నిర్వహిస్తూ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు సునీత మహేందర్ రెడ్డి. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారనీ… ప్రతి ఒక్కరూ తనకు ఓట్లేసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. తూముకుంట, సికింద్రాబాద్ జయలక్ష్మి గార్డెన్స్ లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రచారం నిర్వహించారు.