Maruti Car Accident : యాక్సిడెంట్ అయితే ఫినిష్.. మారుతి కారు అసలు సేఫ్ కాదా..
కారు కొనాలన్న ఆలోచన వస్తే చాలు.. ఆ ఆలోచన మొదలయ్యేది మారుతి కారు (Maruti Car) నుంచే ! తొలి దేశీయ కారుగా మారుతికి ఉన్న రికార్డు అలాంటిది మరి.
కారు కొనాలన్న ఆలోచన వస్తే చాలు.. ఆ ఆలోచన మొదలయ్యేది మారుతి కారు (Maruti Car) నుంచే ! తొలి దేశీయ కారుగా మారుతికి ఉన్న రికార్డు అలాంటిది మరి. దేశంలో ప్రస్తుత అమ్ముడు అవుతున్న కార్లలో మారుతి బ్రాండ్ (Maruti brand) దే హవా. ఇప్పుడే కాదు.. ఏనాడూ మారుతి సేల్స్ (Maruti Sales) ను ఏ కంపెనీ బ్రేక్ చేసిందే లేదు. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను దింపుతూ.. ప్రత్యర్ధులకు పోటీ ఇస్తూనే ఉంది మారుతి. మరి ఇంత డిమాండ్ ఉన్న కారుకు.. అదే రేంజ్ సేఫ్టీ ఉందా అంటే.. నీళ్లు నమాలాల్సిందే ఎవరైనా ! సేఫ్టీ లెక్కలు.. జరిగిన ప్రమాదాలు.. మారుతి కారు భద్రతా బాగోతాలను భయపెట్టాయ్.. ఈ మధ్యే హైదరాబాద్ (Hyderabad) రాయదుర్గంలో (Rayadurgam) మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు యాక్సిడెంట్ అయింది. ఫ్లై ఓవర్ నుంచి కింద పడడంతో.. కారు నుజ్జు నుజ్జు అయింది.
యువకుడు చనిపోయాడు. అది ఏ కారో అని గుర్తించలేనంత ముద్ద ముద్దలా మారిపోయింది ఆ వెహికిల్. ఇప్పుడు కాదు.. మారుతి కారు యాక్సిడెంట్ అయిందా.. కారు గోవిందా, మనిషి గోవిందా అన్నట్లు తయారవుతోంది పరిస్థితి.. రాయదుర్గం ఘటన ఒక్కటే కాదు.. ఆ మధ్య కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత ఘటన కూడా ఇంకా కళ్ల ముందే కదులుతోంది. ప్రమాదం సమయంలో లాస్య.. మారుతి కారులోనే ట్రావెల్ చేశారు. మారుతి XL6 కారులో లాస్య ట్రావెల్ (Lasya Travel) చేసింది. ప్రమాదానికి కారణం ఏంటి అన్నది ఇప్పుడు పక్కనపెడితే.. ప్రమాదం జరిగిన తర్వాత.. కారు ఒక్కదగ్గరకు ముద్దలా.. ఇంకా చెప్పాలంటే ఓ మెటల్ బాల్‌లాగా మారిపోయింది. ఆ కారులోంచి లాస్య డెడ్‌బాడీ తీయడం కూడా కష్టం అయిందంటే.. ఆ వెహికల్ ఎంతలా ప్రెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా వరుస ఘటనలు మారుతి కారు సేఫ్టీ మీద ప్రశ్నలు వచ్చేలా చేస్తున్నాయ్. మారుతి కారులో యాక్సిడెంట్ అయితే.. వితౌట్ టోల్‌గేట్ డైరెక్ట్ పైలోకానికే అని భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. దేశీయ మార్కెట్‌లోకి రిలీజ్ అయ్యే కార్ల సెఫ్లీకి సంబంధించి.. NCAP అంటే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని ఓ పరీక్ష పెడతారు. ఇందులో కారు భద్రతా ప్రమాణాలను లెక్కిస్తారు. ఫ్రంటల్ క్రాష్ టెస్ట్, సైడ్ బారియర్ క్రాష్ టెస్ట్, సైడ్ పోల్ క్రాష్ టెస్ట్, రోల్ ఓవర్ రెసిస్టెన్స్ టెస్ట్.. కారు సెఫ్టీకి సంబంధించి రకరకాల పరీక్షలు పెడతారు. ఐతే ఈ పరీక్షలన్నింటిలోనూ మారుతి కార్లు బోల్తా కొట్టాయ్. సేఫ్టీపరంగా టాప్ 10 కాదు కదా.. టాప్ 20లోనూ మారుతి కారు ఒక్కటి కూడా లేదు.. టాప్ 20లో టాటా, హ్యుండయ్, మహీంద్రా కార్లదే హవా. మారుతి కంపెనీకి చెందిన బ్రీజా కారుకు 20వ ర్యాంకు వచ్చింది. NCAP టెస్టులో మారుతి కార్ల సెఫ్టీకి సంబంధించి సంచలన విషయాలు బయటకు వచ్చాయ్.
దేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న కార్లలో వ్యాగన్ ఆర్ ఒకటి. ఐతే ఈ కారు NCAP సేఫ్టీ రేటింగ్ చూస్తే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. పెద్దల భద్రతలో 34పాయింట్లకు కేవలం 19.69 పాయింట్లు మాత్రమే స్కోర్ చేసి.. సింగిల్ స్టార్ సంపాదించింది. చైల్డ్ సేఫ్టీ కేటగిరీలో 49కి కేవలం 3.40 పాయింట్లు సాధించి.. జీరో స్టార్‌గా మిగిలింది. ఇంత చెత్త సెఫ్టీ ఉన్న కారు ధర తక్కువా అంటే.. అదీ లేదు. ఇక వ్యాగన్ ఆర్‌తో కంపేర్ చేస్తే.. స్విఫ్ట్ కాస్త మెరుగైన రేటింగ్ ఉంది. పెద్దల భద్రతలో 34 పాయింట్లకు 19.19 పాయింట్లు.. చైల్డ్ సెఫ్టీలో 49 పాయింట్లకు 16.68 పాయింట్లను స్కోర్ చేసింది స్విఫ్ట్ కారు. ఇలాంటి సెఫ్టీ రేటింగ్స్ ఉన్నాయ్ కాబట్టే.. ఈ మధ్య ప్రమాదం జరిగిన చిన్న కార్లన్నీ.. మారుతి గ్రూప్‌నకు చెందినవే కనిపిస్తున్నాయ్. మారుతి కారు డ్రైవ్ చేసేప్పుడు జరిగే పరిణాము కూడా.. గుండె గుప్పిట్లోకి వచ్చేలా చేస్తుందనే టాక్ ఉంది. స్పీడ్ 80 దాటిందా మారుతి కారును కంట్రోల్ చేయడం చాలా కష్టమే.
ఇక కారుకు వాడే మెటీరియల్ కూడా అంతా ప్లాస్టిక్ సింథటిక్ కావడంతో… చిన్న ప్రమాదం జరిగినా.. మారుతి కార్లు నుజ్జునుజ్జుగా మారిపోతున్నాయ్. నొక్కుకుపోయిన మెటీరియల్ కారులో ఉన్న వారికి గుచ్చుకుపోయిన మరింత ప్రమాదంగా మారుతోంది. యాక్సిడెంట్ అయితే.. డ్రైవర్‌ను బయటకు తీయడం కూడా ఇబ్బందిగా మారుతోంది. రాయదుర్గం ఘటనలో.. ఆ మధ్య లాస్యనందిత ప్రమాదం విషయంలో జరిగింది అదే. దీంతో ఇప్పుడు మారుతి కారు అంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఐతే ఇన్ని భయాలు కనిపిస్తున్నా.. విక్రయాల విషయంలో మారుతి కార్లు తగ్గేదే లే అంటున్నాయ్. జూన్ విక్రయాలు చూస్తే.. టాప్ టెన్ సేల్స్‌లో ఆరు కార్లు మారుతి కంపెనీ కార్లే కావడం హైలైట్..