DANGER MASALA : ఆ మసాలాలు వాడితే.. క్యాన్సర్ గ్యారంటీ…
మన దేశంలో తయారయ్యే రెండు కంపెనీల మసాలాలు (Masala) వాడితే క్యాన్సర్ (Cancer) గ్యారంటీ అంటోంది హాంకాంగ్. ప్రముఖ కంపెనీలైన ఎవరెస్ట్, MDH... ఈ రెండు సంస్థలు ఉత్పత్తి చేస్తున్న 4 ప్రొడక్ట్స్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని హాంకాంగ్ కి చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ తెలిపింది.
మన దేశంలో తయారయ్యే రెండు కంపెనీల మసాలాలు (Masala) వాడితే క్యాన్సర్ (Cancer) గ్యారంటీ అంటోంది హాంకాంగ్. ప్రముఖ కంపెనీలైన ఎవరెస్ట్, MDH… ఈ రెండు సంస్థలు ఉత్పత్తి చేస్తున్న 4 ప్రొడక్ట్స్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని హాంకాంగ్ కి చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ తెలిపింది.
ఈ రెండు కంపెనీల ఉత్పత్తుల్లో మనుషులు వాడటానికి వీల్లేని ఇథిలీన్ ఆక్సైడ్ (Ethylene oxide) ఉన్నట్టు హాంకాంగ్ తేల్చింది. ఇది పురుగుమందుల్లో ఉండే రసాయనం. ఎవరెస్ట్ కంపెనీకి చెందిన ఫిష్ కర్రీ మసాలాతో పాటు… MDH కు చెందిన 3 స్పైసెస్ లో మద్రాస్ కర్రీ పౌడర్, మిక్సుడ్ మసాలా పౌడర్, సాంబార్ మసాలా… వీటిల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉంది. దీన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ గ్రూప్ 1 క్యాన్సర్ కారకంగా గుర్తించింది.
హాంకాంగ్ లో ఈ నాలుగు ఉత్పత్తుల అమ్మకాలు బంద్ చేశారు. మార్కెట్లో సేల్స్ కి రెడీగా ఉన్న ప్యాకెట్స్ వెంటనే తీసేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే హాంకాంగ్ లో 50 వేల డాలర్ల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష వేస్తారు. ఎవరెస్ట్, MDHకి చెందిన నాలుగు మసాలా పౌడర్స్ లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్ తో పాటు లింప్ గ్రంధుల్లో క్యాన్సర్ కు కారణమయ్యే ఆనవాళ్ళు బయటపడ్డాయి.
ఇథిలీన్ ఆక్సైడ్ వాడటం వల్ల ఇప్పటికిప్పుడు డేంజర్ లేకపోయినా… ఎక్కువ రోజులు ఆ మసాలాలు వాడుతుంటే… ఆరోగ్యం దెబ్బతింటుందని హాంకాంగ్ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జూన్ లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ FDA కూడా.. ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలా, మ్యాగీ మసాలాల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించింది. అక్కడి మార్కెట్ల నుంచి వాటిని తీసేయాలని ఆదేశించింది. 2019 సెప్టెంబర్ లో MDH సాంబార్ మసాలా ప్యాకెట్ల కూడా సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు బయటపడింది.
మన దేశంలో ఈ రెండు బ్రాండ్ల మసాలాలకు ఫుల్ డిమాండ్ ఉంది. కోట్ల మంది భారతీయులు వీటిని వాడుతున్నారు. ఈ మసాలాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని విదేశీ ఆహార సంస్థలు చెప్పేదాకా… మన దేశంలో ఆహార నియంత్రణ సంస్థ ఏం చేస్తోంది. నిద్రపోతోందా అని జనం మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మిగతా కంపెనీల ఉత్పత్తులను కూడా పరిశీలించాలని కోరుతున్నారు.