Tamil Film Industry : ఎక్స్‌ట్రాలు చేస్తే తాట తీస్తాం.. ధనుష్‌కు తమిళన నిర్మాతల షాక్..
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ (Tamil Film Industry) కి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దహీరోనా.. చిన్న హీరోనా.. అని లెక్క చేయరు.

If we do extras, we will take it.. Dhanush gets a shock from the Tamil producers..
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ (Tamil Film Industry) కి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దహీరోనా.. చిన్న హీరోనా.. అని లెక్క చేయరు. లెక్క తప్పితే తాట తీస్తారు. ఎంతవాడైనా కానీ.. షాక్ ఇస్తారు. హీరో ధనుష్ (Dhanush) కు అలాంటి అనుభవమే ఎదురైంది. ధనుష్‌కు తమిళ నిర్మాతలు (Tamil producers) భారీ షాక్ ఇచ్చారు. ఆయన తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్‌లు పూర్తి చేయడం లేదని.. ధనుష్ పై నిర్మాతలంతా కోపంతో ఉన్నారు. ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ధనుష్ కొత్త సినిమా (Dhanush new movie) చేయాలంటే.. కచ్చితంగా నిర్మాతల మండలి పర్మిషన్ ఉండాలి. లేదంటే ధనుష్ సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వమని డిసైడ్ అయ్యారు. ఒక్క ధనుష్‌పై మాత్రమే కాదు అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్‌లు పూర్తి చేయని.. ప్రతీ ఒక్క హీరోకు ఇదే వర్తింస్తుందని తెగేసి చెప్పారు. ఏ హీరో అయినా.. హీరోయిన్ అయినా ఇకపై అడ్వాన్స్‌లు తీసుకోవడం అంటూ ఉండదని క్లియర్‌కట్‌గా చెప్పేసింది కోలీవుడ్. ఇకపై సినిమా పూర్తయ్యాకే.. మరో సినిమాకు కాల్షీట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్‌లు, పెండింగ్ సినిమాలపై నిర్మాతలని.. చిత్ర మండలి రిపోర్డ్ అడిగింది. దీంతో పాటు ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్‌లు కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పేసింది. నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలు తమిళ ఇండస్ట్రీలో కొత్త చర్చలకు దారి తీసుకున్నాయ్. ధనుష్‌పై వేటు వేయడంతో.. నెక్ట్స్ వరుసలో శింబు కూడా ఉన్నాడు.
ఇక అటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాల్ పైనా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని తమిళ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోది. మరోవైపు సినిమా రిలీజ్ అయిన 8వారాల తర్వాతే.. ఓటీటీలోకి రావాలన్న నిర్ణయంతో పాటు.. కోలీవుడ్‌లో సమస్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతోంది నిర్మాతల మండలి. ఇదంతా ఎలా ఉన్నా.. ధనుష్ టార్గెట్‌గా నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవడంతో.. ఆయన ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ మధ్యే ధనుష్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన రాయన్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ధనుష్ తెలుగులో కుబేరా సినిమా చేస్తున్నాడు.