KTR : త్వరలో కేటీఆర్ పాదయాత్ర.. వర్కౌట్ అయ్యేనా ?
పాదయాత్ర చేస్తే.. జైత్రయాత్రే.. అధికారం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ఈ లెవెల్ సెంటిమెంట్‌గా మారింది. వైఎస్ నుంచి చంద్రబాబు, జగన్, లోకేశ్.. తెలంగాణలో రేవంత్ రెడ్డి వరకు.. పాదయాత్ర ప్రతీసారి అధికార పీఠాన్ని దగ్గర చేసింది.
పాదయాత్ర చేస్తే.. జైత్రయాత్రే.. అధికారం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ఈ లెవెల్ సెంటిమెంట్‌గా మారింది. వైఎస్ నుంచి చంద్రబాబు, జగన్, లోకేశ్.. తెలంగాణలో రేవంత్ రెడ్డి వరకు.. పాదయాత్ర ప్రతీసారి అధికార పీఠాన్ని దగ్గర చేసింది. అధికారం కోల్పోయి.. నేతలంతా జారిపోయి.. బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు వీక్‌గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య.. పార్టీ జీవం పోయడంతో పాటు.. మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం.. తెలంగాణ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీఆర్ఎస్‌లో కీలక నేతలంతా కాంగ్రెస్ బాట పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కారు పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఇలాంటి సమయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వారసుడు కేటీఆర్‌ను పాదయాత్రకు సిద్ధం చేస్తున్నారని టాక్. ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐతే హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైందని.. దీనిపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. జనాల్లో ఇప్పటికే తిరుగుబాటు కూడా మొదలైందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులను.. జనాలు గుర్తు చేసుకుంటున్నారని.. అలాంటి వారిలో ధైర్యం నింపేందుకు పాదయాత్రే మంచి నిర్ణయం అని.. కేటీఆర్‌కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇక పార్టీ వీక్ కావడం, నేతలు పార్టీలు మారుతున్న సమయంలో.. కేడర్‌లో, జనాల్లో పాజిటివ్ సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. దీనికోసం జనాల్లో కలిసిపోయేలా పాదయాత్ర ఆలోచన చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయించాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. బీఆర్ఎస్‌ను వ్యతిరేకించి కాంగ్రెస్‌ను ఓటేసిన నిరుద్యోగ యువ, సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వంపైన వ్యతిరేకంగా ఉన్నారని.. పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లడం ద్వారా మంచి జరుగుతుందన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.