ఇవాళ ఈ శ్లోకం పఠిస్తే చదువులో మీకు తిరుగుండదు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు చాలా శుభప్రదమైన రోజు. ఎందుకంటే ఇది మూలా నక్షత్రం. అంతే కాకుండా ఇది సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు చాలా శుభప్రదమైన రోజు. ఎందుకంటే ఇది మూలా నక్షత్రం. అంతే కాకుండా ఇది సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. చదువుల తల్లి జన్మనక్షత్రం కావడంతో ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయని హిందూ పురాణాలు చెప్తున్నాయి. దీంతో చాలా మంది ఇవాళ అక్షరాభ్యాసాలు చేయిస్తారు కూడా. ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణినీ, నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ’ అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని ఇవాళ పూజించడం విద్య పరంగా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.