TELANGANA HEAT WAVES: తెలంగాణకు అలర్ట్.. ఏప్రిల్ నుంచి వడగాల్పులు.

తెలంగాణలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2 తేదీల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉంఢాలని సూచించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2024 | 09:11 PMLast Updated on: Mar 29, 2024 | 9:11 PM

Imd Issues Alert For Heat Waves In Telangana People Should Carefull

TELANGANA HEAT WAVES: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం ప్రారంభమై దాదాపు నెల రోజులవుతుండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా ఎండ వేడి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది.

PAWAN KALYAN: జనంలోకి జనసేనాని.. వారాహి యాత్ర షెడ్యూల్ విడుదల

తెలంగాణలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2 తేదీల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉంఢాలని సూచించింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. రానున్న 3 రోజుల్లోనూ ఎండలు బాగా పెరుగుతాయని, ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం, భద్రాచలం, నల్గొండ ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఏప్రిల్ ఒకటో తేదీన మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో, రెండో తేదీన ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.