Summer Heat Waves: మూడు నెలలు.. మండే ఎండలే.. ఐఎండీ హెచ్చరిక..
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారత్‌లో వడగాల్పుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు.

Summer Heat Waves: దేశంలో ఈసారి ఎండలు భారీగా మండబోతున్నాయి. ఏప్రిల్ నుంచి వచ్చే జూన్ వరకు దేశవ్యాప్తంగా ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Bhadradri Talambralu: భద్రాద్రి సీతారాముల తలంబ్రాలు.. రూ.151 చెల్లిస్తే మీ ఇంటికే
ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారత్‌లో వడగాల్పుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈ సమ్మర్‌లో దేశవ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో తీవ్ర వేడి వాతావరణం ఉంటుంది. సాధారణంగా వేడి గాలులు.. నాలుగు నుంచి ఎనిమిది రోజులు ఉంటాయి. కానీ, ఈసారి మాత్రం వివిధ ప్రాంతాల్లో కలిపి 10 నుంచి 20 రోజులపాటు వేడిగాలుల ప్రభావం ఉండొచ్చు. ఏపీతోపాటు గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈసారి ఏప్రిల్‌లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య భారతం, ఉత్తర మైదాన ప్రాంతాలు, దక్షిణాది రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజులు వడగాల్పులు నమోదవుతాయి.
ఈసారి రెండు నుంచి ఎనిమిది రోజులు వేడి గాలులు వీస్తాయి. ఇక.. ఈ వారానికి సంబంధించి ఏపీ, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 2 నుంచి 5 వరకు వేడి వాతావరణం తీవ్రంగా ఉంటుంది. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఐఎండీ సూచించింది.