IMF REVEALS INDIAN ECONOMY 2023: అగ్రరాజ్యాలకంటే మన ఆర్థికవ్యవస్థల వృద్ది రేటు ఎక్కువ

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2023 | 07:19 AMLast Updated on: Jan 31, 2023 | 7:19 AM

Imf Reveals Indian Economy 2023 అగ్రరాజ్యాలకంటే మన ఆ

ప్రపంచ ఆర్థిక వృద్ధి వచ్చే వార్షిక ఏడాది మరింత బలహీనంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ వృద్ధి 2022లో 3.4 శాతం ఉండగా.. అది 2023 వార్షిక సంవత్సరంలో 2.9 శాతానికి పడిపోతుందని తెలిపింది. ఇది 2024లో 3.1 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ సూచాయిగా చెప్పింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉందని.. పుంజుకునేందుకు సమయం పడుతుందని పేర్కొంది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2022లో 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని వెల్లడించింది. అయితే, అభివృద్ది చెందుతున్న దేశాలలో భారతదేశం ముందుందని.. 2024 ఆర్థిక సంవత్సరలో మళ్లీ 6.8 శాతానికి వృద్ధి చెందుతుందని భవిష్యత్ గణాంకాలను వివరించింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనా ప్రకారం.. “అక్టోబర్ ఔట్‌లుక్‌తో పోలిస్తే భారతదేశానికి సంబంధించి మా వృద్ధి అంచనాలు మారలేదు. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మేము 6.8 శాతం వృద్ధిని కలిగి ఉన్నాం.. ఇది మార్చి వరకు కొనసాగుతుంది. ఆపై ఆర్థిక సంవత్సరంలో 2023లో 6.1 శాతంగా కొంత మందగమనాన్ని మేము ఆశిస్తున్నాము. ఇది చాలావరకు బాహ్య కారకాలతో ప్రభావితం అవుతుంది..” అని చీఫ్ ఎకనామిస్ట్, IMF పరిశోధన విభాగం డైరెక్టర్ పియర్-ఒలివియర్ గౌరించాస్ పేర్కొన్నారు. భారతదేశంలో వృద్ధి రేటు 2022లో 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతానికి క్షీణిస్తుంది. 2024లో 6.8 శాతానికి చేరుకుంటుంది.. బాహ్య ప్రకంపనలు ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని తెలిపారు.

” rel=”noopener” target=”_blank”>

 

అగ్రరాజ్యమైన అమెరికా, బ్రిటన్, చైనా దేశాలతో పొలిస్తే భారత్ వృద్ధిలో ముందంజలో ఉన్నట్లు ఐఎంఎఫ్ పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలలో భారత్ అగ్రభాగన ఉందని.. ఇదే మున్ముందు కొనసాగుతుందని తెలిపింది. ప్రస్తుత అంచనాలు చైనా ఆర్థిక వ్యవస్థను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఐఎంఎఫ్ వెల్లడించింది. కోవిడ్-19 పరిమితుల సడలింపుల మధ్య 2023లో చైనాలో వృద్ధి 5.2 శాతానికి పెరిగి 2024లో 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2023లో ప్రపంచ వృద్ధిలో చైనా, భారతదేశం దాదాపు సగం వాటాను కలిగి ఉన్నాయి. ఆసియాలో వృద్ధి రేటు 4.3 శాతం నుంచి 5.3 శాతానికి పెరిగిందని వివరించింది.

అక్టోబర్ 2022 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ (WEO)లో చెప్పినదానికంటే 2023 అంచనా 0.2 శాతం ఎక్కువగా ఉంది. సగటున 3.8 శాతం ఉంటుందని లెక్కకట్టింది. ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు సెంట్రల్ బ్యాంక్ రేట్లు పెరగడం, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. చైనాలో COVID-19 వ్యాప్తి కారణంగా 2022లో వృద్ధి తగ్గిందని తెలిపింది. ప్రపంచ ద్రవ్యోల్బణం 2022లో 8.8 శాతం నుంచి 2023లో 6.6 శాతానికి, 2024లో 4.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇప్పటికీ మహమ్మారికి ముందు (2017–19) ఉన్న వృద్ధి కంటే దాదాపు 3.5 శాతం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలను వెల్లడిచేసింది.