Michoung Typhoon Telangana : తెలంగాణపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తున్న భీకర వర్షాలు.. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దానికి కారణం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్ తుఫాను.. డిసెంబర్ 5న ఈరోజు అర్థరాత్రికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది.
తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తున్న భీకర వర్షాలు.. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దానికి కారణం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్ తుఫాను.. డిసెంబర్ 5న ఈరోజు అర్థరాత్రికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది. దీంతో ఈ తుఫాన్ ప్రభావం పొరుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఒడిశా, చత్తిస్ ఘాడ్, పుదుచ్చేరి వంటి ప్రాంతాలోను కూడా ఉంటుంది. దీంతో ఇప్పటికే చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ తుఫాను ప్రభావంతో.. నిన్న రాత్రి వాతావరణ చాలా చల్లబడిపోయింది. రాత్రంతా చల్లా గాలులు వీసాయి. కాగా ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ అంతటా చిరు జల్లుల రూపంలో తుంపర.. వర్షం కురుస్తోంది. హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట్, బాలానగర్, కూకట్పల్లి, వర్షం కురిసింది.
కొండాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, చంద్రగిరి, కోఠి, చంద్రగిరి, కోఠిలో ఓ మోస్తారు వర్షం పడుతున్నాయి. కాగా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ జిల్లాలో భారీ వర్షాలు..
భద్రాద్రి- కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
నేటి నుంచి రేపటి వరకు ములుగు, భద్రాద్రి- కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు