PL FINAL FIX 2 : రాయల్స్ ఇంటికి… సన్ రైజర్స్ ఫైనల్ కి

గతేడాది పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన హైదరాబాద్‌.. ఈ సీజన్‌లో ఆరంభం నుంచే అద్భుతంగా ఆడి ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్‌ 2లో రాజస్థాన్‌ను 36 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది సన్‌రైజర్స్‌. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2024 | 10:48 AMLast Updated on: May 25, 2024 | 10:48 AM

In A Must Win Match For The Final Berth Hyderabad Sunrisers Once Again Failed

ఫైనల్ బెర్త్‌కోసం గెల్చి తీరాల్సిన మ్యాచ్‌లో మరోసారి హైదరాబాద్‌ సన్‌రైజర్స్ జూలు విదిల్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి… రాజస్థాన్ రాయల్స్‌ను ఇంటి దారి పట్టించింది. ఈ గెలుపుతో నేరుగా ఫైనల్‌కు చేరిన హైదరాబాద్.. కోల్‌కతాకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది.

గతేడాది పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన హైదరాబాద్‌.. ఈ సీజన్‌లో ఆరంభం నుంచే అద్భుతంగా ఆడి ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్‌ 2లో రాజస్థాన్‌ను 36 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది సన్‌రైజర్స్‌. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది.

ఆరంభంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 42 పరుగులతో అదరగొట్టాడు. జైస్వాల్ దూకుడు చూసినవారికి… రాజస్థాన్‌ విజయం సాధించేలా కనిపించింది. కానీ, హైదరాబాద్‌ స్పిన్నర్లు వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టుబిగించారు. 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్థాన్‌.. ధ్రువ్ జురెల్ .. అర్థసెంచరీతో ఆదుకున్నాడు. అయితే స్నిన్నర్లు షాబాజ్‌ అహ్మద్, అభిషేక్ శర్మ అదరగొట్టారు. నటరాజన్, కమిన్స్‌ తలో వికెట్ తీశారు. ఆదివారం కోల్‌కతా, హైదరాబాద్‌ మధ్య టైటిల్‌ పోరు రసవత్తరంగా జరగనుంది. హైదరాబాద్‌ బ్యాటర్లలో హెన్రిచ్‌ క్లాసెన్‌ అర్థసెంచరీ చేయగా.. రాహుల్ త్రిపాఠి తుఫాన్ విధ్వంసం సృష్టించాడు. క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ట్రావిస్ హెడ్ 34 పరుగులో ఫర్వాలేదనిపించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2016 ఛాంపియన్‌గా, 2018లో రన్నరప్‌గా నిలిచిందీ జట్టు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో 18 పరుగులు చేసి కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టిన షాబాజ్ అహ్మద్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఫస్ట్ క్వాలిఫయర్‌లో తలపడిన కోల్‌కతాతోనే ఫైనల్‌లో ఢీకొడుతోంది హైదరాబాద్‌.

గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడుతుందా అన్నట్లుగా పేలవమైన ఆటతీరు కనబర్చింది సన్‌రైజర్స్. దీంతో కనీసం ప్లే ఆఫ్‌కైనా చేరుతుందా అన్న అనుమానాలు అభిమానుల్లో కలిగాయి. తే .. ఐపీఎల్‌-2024లో మాత్రం దుమ్ములేపుతోంది. జూలు విదిల్చిన సింహంలా పరుగుల వేట మొదలుపెట్టి అద్భుత విజయాలతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది సన్ రైజర్స్. ప్లే ఆఫ్స్‌లోనూ అదిరేటి ఆట తీరు కనబర్చిన సన్ రైజర్స్… ఫైనల్ బెర్తు పట్టేసింది. ఎలిమినేటర్ పోరులో తన ఎంట్రీని ఘనంగా చాటింది. బలమైన జట్లను ఓడించి.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈసీజన్‌లోనే అత్యధిక స్కోర్‌ రికార్డును బద్దలు కొట్టింది. క్వాలిఫయర్ వన్‌ మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడినా… క్వాలిఫయర్-2లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది SRH. రాజస్థాన్ రాయల్స్‌ను ఇంటికి పంపించింది.

విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి …క్యాష్‌ రీచ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరుగా 287 పరుగులు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మతో పాటు హెన్రిచ్‌ క్లాసెన్‌ కూడా దంచికొడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నారు. మొత్తంగా లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు.. 8లో గెల్చి నెట్ రన్‌ రేటుతో రెండో స్థానంలో నిలిచింది. దాంతో క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. కానీ కీలక పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓడిపోయింది. సన్‌రైజర్స్‌ జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌, ప్యాట్‌ కమిన్స్‌, నటరాజన్‌ లాంటి టాప్ బౌలర్లు ఉన్నారు. ఈ సీజన్‌లో SRH భారీ స్కోర్లు సాధిస్తుండటంతో వారి బ్యాటింగ్‌ లైనప్‌ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి వారి బౌలింగ్‌ లైనప్‌ కూడా అంతే విధ్వంసకరంగా ఉంది.

గతంలో హైదరాబాద్ జట్టుకు ఇప్పటికీ ఒకటే తేడా కెప్టెన్సీ మార్పు.. పాట్ కమిన్స్.. హైదరాబాద్ జట్టును విజేతలా మార్చాడు. జట్టు దృక్పథంలో మార్పు తేవడంలో విజయవంతమయ్యాడు. పూర్తి సానుకూల దృక్పథంలో నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు కమిన్స్.. ఎంతలా అంటే క్వాలిఫయర్ -1లో కేకేఆర్ చేతిలో ఓడినా.. ఆ మ్యాచ్‌లో కుర్రాళ్లు సరైన సన్నద్ధతతో లేరన్నాడు కమిన్స్.. ఇంకా తమకు చాఫియన్ గా నిలిచే అర్హత ఉందనడం.. అన్నట్లుగానే క్వాలిఫయర్ -1లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి జట్టును ఫైనల్ కు చేర్చాడు కమిన్స్ KKR …. 17 సీజన్లలో ఎనిమిది సందర్భాల్లో మొదటి నాలుగు స్థానాలను అధిగమించి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది.

2014లో ఒక్కసారి మాత్రమే ట్రోపీ గెలిచింది. 2021లో ఫైనల్‌కు చేరినా మళ్లీ లీగ్‌ను గెలవలేదు. ఈసారి ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. సీజన్ మొదటి నుంచి ఆ జట్టు మిగిలి టీమ్స్ ని ఓడిస్తూ ముందుకెళ్ళింది. పాయింట్ల పట్టికలోనూ అగ్రభాగాన ఉంటోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది మ్యాచ్ లను గెలిచి… పందొమ్మిది పాయింట్లు సాధించిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ కు చేరింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో పన్నెండు మ్యాచ్ లు ఆడి తొమ్మిదింటిలో గెలిచింది. కేకేఆర్ జట్టుగా నాయకుడిగా శ్రేయాస్ అయ్యర్ సానుకూల దృక్పథం, మెంటార్‌గా గంభీర్ ప్లానింగ్ … ఆ జట్టును అబేధ్యమైనది మార్చాయంటారు. ఓ సహచరుడిగా కన్నా లీడర్‌గానే గంభీర్ కనిపిస్తాడు. ఆయన వచ్చాకే కేకేఆర్ .. ఆటతీరు మారినట్లు తెలుస్తోంది.

ఓ విషయంలో మాత్రం కేకేఆర్.. సన్‌ రైజర్స్‌ కన్నా మేటిగా కనిపిస్తోంది. క్వాలిఫయర్ -1లో చిత్తు చేసిన సన్‌రైజర్స్‌తో… మరోసారి తలపడుతోంది కేకేఆర్. దీంతో ఆ పాజిటివ్ నెస్‌.. ఎంతైనా ఉపయోగపడుతుందన్న ఆలోచనలో ఉన్నారు జట్టు ఆటగాళ్లు… ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలా ఐదు టైటిళ్ళు గెలుచుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు, రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఒక్కో టైటిల్‌ను గెలుచుకున్నాయి. ఈసారి పోటీల్లో హైదరాబాద్ సన్ రైజర్స్… 14 రౌండ్లలో 8 విజయాలతో రెండో స్థానం సాధించింది. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ ప్లే-ఆఫ్ ఫస్ట్ బెర్త్ ను టేబుల్ టాపర్ గా కోల్ కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకుంటే..మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో నిలిచింది.