తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికార పగ్గాలు అందుకుంది. అసెంబ్లీ సమావేశాలు మొదలైనపట్టి నుంచి తెలంగాణ రాజకీయాలు మరింత రసవంతగా మారాయి. ఇది వరకు ఎన్నికల్లోనే కాకుండా.. ఎన్నికల అనంతరం కూడా రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నడూ లేనంతగా.. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం రెండూ కూడా ప్రశ్నలు, జవాబులతోపాటు.. విమర్శలతో హీటుపుట్టించాయి. CM Revanth Reddy : నేడు సీఎం హోదాలో జిల్లా కలెక్టర్లతో.. తెలంగాణ సచివాలయంలో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం vs స్వేద పత్రం.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా గత తొమ్మిదెన్నర పాలన, అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము పదేళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసిన బీఆర్‌ఎస్.. శ్వేత పత్రానికి కౌంటర్ గా స్వేదపత్రంను ఇవాళ విడుదల చేయనుంది. తెలంగాణ భవన్ వేదికగా ఆదివారం ఉదయం 11 గంటలకు “స్వేద పత్రం” పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమం నిన్నే జరగాల్సి ఉంది.. అనుకోని కారణల వల్ల నేడు ఆ కార్యక్రమం జరుగుతోంది. అయితే, ఇవాళ కేటీఆర్ స్వేద పత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ శ్వేత ప్రతం కు కౌంటర్ గా స్వేద పత్రం విడుదల చేశారు మాజీ మంత్రి కేటీఆర్.