China Flight Tickets : రూ. 114కే విమానం టికెట్.! భలే మంచి చౌక బేరం !
114 రూపాయలకే విమానం టిక్కెట్. అవును మీరు చదువుతున్నది కరెక్టే. మరీ ఇంత తక్కువకే విమానం టిక్కెట్టా.. ఎక్కడి నుంచి ఎక్కడికి.. అసలు ఏ ఎయిర్ లైన్స్ ఇంత చీప్ గా విమానం టిక్కెట్ఇస్తోంది అని ఆశ్చర్యపోతున్నారా..

In China.. that too with a technical fault in the computers of a leading airline, customers got very cheap tickets
114 రూపాయలకే విమానం టిక్కెట్. అవును మీరు చదువుతున్నది కరెక్టే. మరీ ఇంత తక్కువకే విమానం టిక్కెట్టా.. ఎక్కడి నుంచి ఎక్కడికి.. అసలు ఏ ఎయిర్ లైన్స్ ఇంత చీప్ గా విమానం టిక్కెట్ఇస్తోంది అని ఆశ్చర్యపోతున్నారా.. ఈ చౌక విమాన టిక్కెట్టు (Flight tickets) మన దేశంలో కాదండీ. చైనాలో.. అది కూడా ఓ ప్రముఖ విమానయాన సంస్థలోని కంప్యూటర్లలో టెక్నికల్ ఫాల్ట్ తో కస్టమర్లకు చాలా చౌకగా టికెట్లు దొరికాయి.
గాంగ్జూ ప్రావిన్స్ ప్రధానకేంద్రంగా చైనా (China) సదరన్ ఎయిర్‌లైన్స్ సంస్థ పనిచేస్తోంది. ఆ సంస్థకు చెందిన మొబైల్ యాప్‌లో ఈమధ్య రెండు గంటలపాటు సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ టైమ్ లో విమానం టిక్కెట్టు ధరలు కేవలం 1.30 డాలర్లకే దొరికాయి. కొందరు కస్టమర్లు సోషల్ మీడియాలో ఈ సంగతి పోస్టు చేశారు. దాంతో విషయం బయటకు వచ్చింది. చెంగ్డూ నగరానికి రాకపోకలు సాగించే విమానాల టికెట్ ధరలు 10 నుంచి 30 యువాన్లలోపే దొరికాయి. అంటే 1.37 డాలర్ల నుంచి 4.12 డాలర్ల లోపే అందుబాటులోకి వచ్చాయి.
మన కరెన్సీలో అయితే వాటి విలువ రూ.114 మాత్రమే. చెంగ్డూ-బీజింగ్ విమాన ప్రయాణ టికెట్ రేట్ కేవలం 1.37 డాలర్లుగా ఉంది. కానీ ఈ రేట్ 55 డాలర్ల నుంచి 69 డాలర్ల మధ్యలో ఉంటుంది. వీటికి అదనంగా 15 డాలర్ల వరకు ఎయిర్‌పోర్టు ఫీజు, ఫ్యూయల్ సర్‌ఛార్జీలు వసూలు చేస్తుంటారు. కానీ అవి కూడా టిక్కెట్ లో చూపించలేదు. అంత తక్కువ ధరకే టిక్కెట్లు తీసుకున్న కస్టమర్లు వాటిని వాడుకోవచ్చని విమానయాన సంస్థ తెలిపింది. అసలు ఈ టెక్నికల్ సమస్య ఎందుకు వచ్చింది అన్నది మాత్రం చైనా సదరన్ ఎయిర్ లైన్స్ చెప్పలేదు. మొత్తానికి కస్టమర్లు మాత్రం… ఏదైతే అది అయింది.. భలే చౌకగా టిక్కుట్లు దొరికాయి అని సంబరపడుతున్నారు.