Kedharnath: గర్భగుడిలో గలీజ్ పని..
ఆలయ గర్భగుడి అంటే పరమపవిత్రం. ప్రతీ హిందువుకు ప్రాణ సమానం. అలాంటి గర్భ గుడిలో వెర్రివేశాలు వేశారు ఓ మహిళ. పదకొండవ జ్యోతిర్లింగం కేదార్నాథ్ గర్భగుడిలో శివలింగం మీద డబ్బులు జల్లుతూ డాన్సులు చేశారు.

In Kedarnath temple, a woman misbehaved by dancing and sprinkling money on the deity.
నిజానికి కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడమే నిషేదం. అలాంటిది ఏకంగా శివలింగం మీద డబ్బులు జల్లుతూ బారాత్‌లో డాన్స్ చేసినట్టు చిందులేస్తూ మొత్తం సీన్‌ను వీడియో షూట్ చేశారు. ఆ మహిళ డాన్స్ చేస్తూ డబ్బులు జల్లుతున్న సమయంలో పూజారులు కూడా పక్కనే ఉన్నారు. మంత్రాలు చదువుతూనే ఉన్నారు. మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆ మహిళతో గర్భగుడిలోనే ఉన్నారు. వాళ్లిద్దరు కూడా ఆలయ సిబ్బందే అంటున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయ గర్భగుడిలో ఇలాంటి చేష్టలు చయడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రయాగ్‌రాజ్ జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. వీడియోలో ఉన్న మహిళపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీని ఆదేశించారు. మహిళతో పాటు వీడియోలో ఇద్దరు ఉద్యోగులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన మహిళ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.