Star Hero : హీరోయిన్ కక్కుర్తి బయటపెట్టిన నిర్మాత, ఛీ మరీ ఇలానా…?
ఈ మధ్య కాలంలో కాస్త స్టార్ ఇమేజ్ వస్తే చాలు సినీ జనాలు ఒక రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు. కొత్త హీరోయిన్లు ఒక్క హిట్ కొడితే చాలు ఎక్కడా ఆగడం లేదు.
ఈ మధ్య కాలంలో కాస్త స్టార్ ఇమేజ్ వస్తే చాలు సినీ జనాలు ఒక రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు. కొత్త హీరోయిన్లు ఒక్క హిట్ కొడితే చాలు ఎక్కడా ఆగడం లేదు. హీరోల కంటే ఎక్కువ డిమాండ్ లతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక సినిమా భారీ వసూళ్లు చేసినా లేక ఆ సినిమాకు క్రేజ్ వచ్చినా సరే వాళ్ళను నిర్మాతలు కట్టడి చేయలేని పరిస్థితి ఉందనే మాట వాస్తవం. ఒకటి రెండు సినిమాలకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కొంత మంది హీరోయిన్లు ప్రతీ చిన్న విషయానికి డబ్బులు డిమాండ్ చేయడం చికాకుగా మారింది.
తాజాగా దీనిపై ఒక తమిళ నిర్మాత ఘాటుగా స్పందించారు. ఒక హీరోయిన్ ప్రమోషన్ కోసం కూడా డబ్బులు డిమాండ్ చేయడం పట్ల ఆయన సీరియస్ అయిపోయారు. తమిళ నిర్మాత సురేష్ కామాక్షి నిర్మించిన ఒక సినిమాలో అపర్ణతి హీరోయిన్ గా నటించింది. సినిమా ప్రమోషన్ కోసం ఆమె మూడు లక్షలు డిమాండ్ చేసిందట. దీనిపై నిర్మాత మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నడిగర్ సంఘంలో సభ్యత్వమే పక్క రాష్ట్రానికి చెందిన హీరోయిన్ ఇలా డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆయన మండిపడ్డారు.
హీరోయిన్ అపర్ణతి తమా సినిమా ప్రమోషన్‌కు రాకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించిన నటీనటులు ప్రమోషన్లకు రాకపోవడం పరిశ్రమకు ఒక శాపంలా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఈ సినిమా ప్రమోషన్‌కు వచ్చేందుకు అపర్ణతి ఏకంగా రూ.3 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా అనేక షరతులు కూడా విధించారని సురేష్ కామాక్షి మండిపడ్డారు. అవన్నీ బయటపెడితే పెద్ద గొడవ అవుతుందని తాను మాట్లాడటం లేదని… సినిమా ప్రమోషన్ కు రావాలని చెప్తే ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నానని చెప్పారని… ఆమె అక్కడ ఉండటమే తమిళ సినిమాకు చాలా మంచిదని ఆమె పేర్కొన్నారు.