Level Cross : కాలేజి పిల్లల ముందు మాజీ హీరోయిన్ స్కిన్ షో
ఈ మధ్య కాలంలో సినిమా నటీ నటులు (Movie actors) పెళ్ళిళ్ళు అయినా పిల్లలు పుట్టినా స్టైల్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. సినిమా నటులు అనేం ఉంది గాని సామాన్యులు కూడా అదే విధంగా ఉన్నారు.

In recent times, movie actresses and actors are not taking a step back in terms of style, whether they get married or have children.
ఈ మధ్య కాలంలో సినిమా నటీ నటులు (Movie actors) పెళ్ళిళ్ళు అయినా పిల్లలు పుట్టినా స్టైల్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. సినిమా నటులు అనేం ఉంది గాని సామాన్యులు కూడా అదే విధంగా ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా మాజీ హీరోయిన్ లు స్కిన్ షో చేసే విషయంలో ఎక్కడా తగ్గడం లేదనే మాట వాస్తవం. స్టార్ హీరోయిన్స్ (Star heroines) నుంచి చిన్న చిన్న హీరోయిన్స్ వరకు అంతే. అయితే ఇవి క్రమంగా వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా మాజీ హీరోయిన్ అమలాపాల్ (Amalapal) ధరించిన ఒక డ్రెస్ వివాదానికి వేదిక అయింది.
ఇటీవల అమలాపాల్ లెవల్ క్రాస్ (Level Cross) అనే సినిమాలో నటించగా ఆ సినిమా మంచి సక్సెస్ అయింది. అమలాపాల్, అసిఫ్ అలీ (Asif Ali) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టాక్ పాజిటివ్ గా రావడంతో అమలాపాల్ మంచి జోష్ మీద ఉంది. మొదటి వివాహంతో వైవాహిక జీవితం (Married Life) లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ అమ్మడు… జగత్ దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లి కూడా అయింది. తల్లి కావడంతో కాస్త డీసెంట్ గా ఉండాల్సిన అమలాపాల్ కాస్త హద్దులు దాటింది అనే ఆరోపణలు బాగా వినిపించాయి.
లెవెల్ క్రాస్ అనే సినిమా ప్రమోషన్ కోసం కేరళలోని ఎర్నాకుళంలో ఒక కాలేజికి (College Students) వెళ్ళింది. ఆ సందర్భంగా ఆమె ధరించిన డ్రెస్ సినిమా పేరు మాదిరిగానే లెవెల్ క్రాస్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. కాలేజి పిల్లల ముందు ఆమె అసభ్యంగా కనపడిందని సోషల్ మీడియాలో విమర్శలు రాగా తనదైన శైలిలో ఆమె స్పందించింది. తాను వేసుకున్న దుస్తులు తనకు సౌకర్యంగా ఉన్నాయని, కాలేజి విద్యార్ధులు కూడా ఎక్కడా ఇబ్బంది పడలేదని, కానీ కెమెరాల్లో తనను చూపించిన విధానం కారణంగా ప్రజల నుంచి విమర్శలు వచ్చాయని ఆమె తన మార్క్ ఆన్సర్ ఇచ్చింది. ఆమె డ్రెస్ మీరు చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.