Kashmir Girl: కశ్మీర్ యువతి బైక్ రైడ్ వైరల్.. ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్ ఇదీ..
ఆర్టికల్ 370 రద్దు అయితే ఏమవుతుందని ప్రశ్నించిన వాళ్లందరికీ.. ఈ అమ్మాయి బైక్ రైడే ఆన్సర్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఎలా మారాయ్.. అక్కడి జనాలు ఎలాంటి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారనే దానికి ఈ యువతి ఆనందమే సాక్ష్యం. కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడమే లక్ష్యం అంటూ.. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ రద్దు తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్.

In Srinagar, Kashmir, a young woman rode a Royal Enfield bike and roamed freely on the roads
కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత.. శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను గర్వంగా చెప్పాలనుకుంటున్నానని.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనకు కూడా చాలా మారిపోయిందంటూ.. అందరు యువతులను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదని.. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ కామెంట్ చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దుతో స్వేచ్ఛ దొరికిందని ఆ యువతి చెప్తే.. ఇంకొందరికి మరోలా అర్థం అయింది. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు.. వింతగా రియాక్ట్ అవుతున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ.. అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా.. అమ్మాయిలకు వర్తించవా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా రియాక్ట్ అవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎలా ఉన్నా.. కశ్మీర్‌లో పరిస్థితులు ఎంతలా మారిపోయాయ్ అని చెప్పడానికి.. ఈ వీడియో సాక్ష్యం అంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. దటీజ్ మోదీ.. భారత్ మాతాకీ జై అంటూ వీడియో షేర్ చేస్తున్నారు.