6 GUARANTEES : రేవంత్ సర్కార్ మెడ మీద కత్తి.. 6 గ్యారంటీలకు 40రోజులే టైమ్

తెలంగాణలో 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి రేవంత్ రెడ్డి సర్కార్ మెడ మీద కత్తివేలాడుతోంది. 100 రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని చెప్పినా.. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ నెల ముందే వస్తోంది. దాంతో అనుకున్న టైమ్ కంటే ముందే ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో మరో 40 రోజుల్లోనే హామీలను అమలు చేయడం అనేది సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2024 | 03:18 PMLast Updated on: Jan 08, 2024 | 3:18 PM

In Telangana Revanth Reddys Sarkar Came To Power With The Promise Of 6 Guarantees

తెలంగాణలో 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి రేవంత్ రెడ్డి సర్కార్ మెడ మీద కత్తివేలాడుతోంది. 100 రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని చెప్పినా.. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ నెల ముందే వస్తోంది. దాంతో అనుకున్న టైమ్ కంటే ముందే ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో మరో 40 రోజుల్లోనే హామీలను అమలు చేయడం అనేది సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ గా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యాయి. తాము ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఆ ప్రకారం ఇంకా మార్చి 15 దాకా టైమ్ ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. లోక్ సభ ఎన్నికలకు ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడే ఛాన్సుంది. దాంతో కాంగ్రెస్ సర్కార్ కి గ్యారంటీల అమలుకు ఇంకా 40 రోజులే టైమ్ ఉంది. రేవంత్ సీఎం గా ప్రమాణం చేసిన వారం రోజుల లోపే మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు.. రెండు స్కీమ్స్ అమలు చేశారు. ఈ ఆరు గ్యారంటీల్లో మొత్తం 14 హామీలను ఇచ్చారు. వాటిల్లో రెండు పూర్తయ్యాయి. మిగిలిన 12 స్కీమ్స్ అమలు చేయాల్సి ఉంది. ఎన్నికల కోడ్ వస్తే.. గ్యారంటీల అమలు వాయిదా పడుతుంది. షెడ్యూల్ పేరు చెప్పి.. తప్పించుకోవాలని చూస్తే లోక్ సభ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. బీఆర్ఎస్, బీజేపీకి సార్వత్రిక ఎన్నికలకు ఇవే అస్త్రాలు అవుతాయి.

ప్రస్తుతం ప్రజాపాలన కింద అప్లికేషన్లు తీసుకున్నారు. వాటి డేటా ఎంట్రీ జరుగుతోంది. అవి జనవరి 17 వరకూ పూర్తవుతాయి. ఆ తర్వాతే 12 పథకాలకు సంబంధించి గైడ్ లైన్స్ రిలీజ్ చేసి… లబ్దిదారులను ఎంపిక చేయాలి. స్కీమ్స్ తీసుకోవాలంటే రేషన్ కార్డు కావాలి.. ముందు రేషన్ కార్డు ఇచ్చి.. ఆ తర్వాత పథకాలు అమలు అంటే చాలా టైమ్ పడుతుంది. పాత కార్డుల ప్రకారం ఇస్తామంటే.. జనం ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల కోసం అప్లయ్ చేసుకొని విసిగి వేసారిపోయారు చాలామంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమస్య తీవ్రంగా ఉంది. కొత్త బడ్జెట్ వచ్చేలోపు ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బులు కావాలి. కేంద్ర ప్రభుత్వంతో పాటు RBI తోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తేవాలి.. కేంద్రం సరైన టైమ్ కి రిలీజ్ చేస్తుందా.. లాంటి అనేక అనుమానాలు ఉన్నాయి.