HMDA BALAKRISHNA : లెక్కతేలని బాలకృష్ణ ఆస్తులు.. 30మంది అధికారుల సహకారం
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో...తవ్వుతున్నకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నిస్తోంది.

In the corruption case of former director of HMDA Shiv Balakrishna, irregularities are coming to light.
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో…తవ్వుతున్నకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నిస్తోంది.
అవినీతి అనకొండ, HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులను చూసి… ఏసీబీ అధికారులే మతి పోతోంది. తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా లెక్కకు మించి బయటపడుతున్నాయి. నగదు, బంగారం, వెండి, వాచ్‌లు, స్మార్ట్ ఫోన్లే కాదు… 120 ఎకరాలకు పైగా భూములను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్, బీబీనగర్ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములను ఉన్నట్లు తేలింది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల పేర్లతో భారీగా బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని కూడా ఏసీబీ విచారించింది. బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. సంస్థలకు లబ్ధి చేకూర్చి శివ బాలకృష్ణ వాటాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు.
బాలకృష్ణ సోదరుడు శివ సునీల్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సునీల్, అతని భార్య పేరుతోనూ భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. శివ సునీల్ రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు తేల్చారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎల్బీనగర్, బంజారాహిల్స్‌లోని హైరైజ్ టవర్స్ నిర్మిస్తున్నాయి. బాలకృష్ణ సెల్‌ఫోన్ డేటాపై ఏసీబీ దృష్టి పెట్టింది. కాల్ డేటా తీసుకొని విచారిస్తే… బినామీల వివరాలు, అండగా నిలిచిన అధికారులు, గత ప్రభుత్వంలో అండగా నిలిచిన రాజకీయ నేతలు ఎవరన్నది తేలుతుందని భావిస్తోంది. ఇప్పటి వరకు బాలకృష్ణ 30 మంది అధికారులు సహకరించినట్లు గుర్తించారు. వీరిలో కొందర్ని ఇప్పటికే విచారించారు. బాలకృష్ణ ఇంట్లో 99 లక్షల 60 వేల నగదు, 19 వందల 88 గ్రాముల బంగారం, సిల్వర్ 6 కేజీలు సీజ్ చేశారు. 8 కోట్ల 26 లక్షల రూపాయలు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూలో ఇంకా ఎక్కువ ఉంది. మిగిలిన బీనామీలపై విచారణ చేస్తున్నారు.