Dubairains : ఎడారి దిబ్బల దేశంలో.. కుండపోత వర్షం.. 75 దేశ చరిత్రలో అతిపెద్ద కుంభవృష్టి

ఎడారి దేశం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. దుబాయ్.. ఎప్పుడు ప్రపంచ దేశాలకు పెట్రోల్.. డీజీల్ వంటి ఖరితైన ఇందనాలను ఎగుమతి చేసే దేశం.. ఇప్పుడు భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2024 | 12:14 PMLast Updated on: Apr 18, 2024 | 12:16 PM

In The Country Of Desert Dunes Torrential Rain 75 The Biggest Flood In The Countrys History

ఎడారి దేశం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. దుబాయ్.. ఎప్పుడు ప్రపంచ దేశాలకు పెట్రోల్.. డీజీల్ వంటి ఖరితైన ఇందనాలను ఎగుమతి చేసే దేశం.. ఇప్పుడు భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతుంది. సాధారణంగా దుబాయ్ పరిసర ప్రాంతాలలో ఎక్కడ చూసిన ఇసుక దిబ్బలు కనిపిస్తాయి.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన నగరాలు చెరువులుగా.. రోడ్లు నదులుగా.. దర్శనమిస్తున్నాయ్.

ఇక విషయంలోకి వెలితే.. ప్రస్తుతం దుబాయ్ దేశం భారీ వర్షాలకు ఎక్కడ చూసిన నీటిలో మునిగిన ప్రాంతాలే కనిపిస్తున్నాయ్. ఎయిర్ పోర్టులు, మెట్రో స్టేషన్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లు ఇలా అన్ని కూడా నీటమునిగిపోయాయి. ఉరుములు, మెరుపులతో కుండపోత వానలతో దుబాయ్ అతలాకుతలమైన పోయింది. ఎయిర్ పోర్ట్, మెట్రో స్టేషన్ నీట మునిగిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 24 గంటల సమయంలోనే ఏడాదిన్నరలో కురవాల్సిన వాన కురిసింది. 24 గంటలు.. 162 మి.మీటర్ల వర్షపాతం వర్షం కురిసి రికార్డు నమోదు చేసింది. జన జీవనం అస్తవ్యస్తం.. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి గా రికార్డు.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 75 ఏళ్ల చరిత్రలో ఏడారి దేశంలో ఇదే అతి పెద్ద భారీ వర్షాలుగా నమోదయ్యాయి.

SSM.