112 ఏళ్ళ సినిమా చరిత్రలో “ప్రభాస్” ఒక్కడిదే ఈ రికార్డ్

ఏ ముహూర్తంలో ప్రభాస్ సినిమాల్లోకి అడుగు పెట్టాడో గాని ఒక్కో రికార్డుని తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2024 | 12:51 PMLast Updated on: Aug 23, 2024 | 12:51 PM

In The History Of 112 Years Of Cinema Prabhas Holds This Record Alone

ఏ ముహూర్తంలో ప్రభాస్ సినిమాల్లోకి అడుగు పెట్టాడో గాని ఒక్కో రికార్డుని తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా గతినే మార్చేసిన ప్రభాస్… ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఇండియన్ సినిమాలో ఒకే ఒక్కడిగా నిలుస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాలకు వచ్చే కలెక్షన్ లు ప్రభాస్ హిట్ సినిమాలకు వచ్చే వసూళ్లు దాదాపు ఒక్కటే. ఇంకా ప్రభాస్ దే పైచేయి అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ మరింత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.

కల్కీ సినిమాతో ప్రభాస్ 1200 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసి ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసాడు. ఇప్పుడు ప్రభాస్, నాన్ ప్రభాస్ అన్నట్టుగా సినిమా మారిపోయింది. అలాంటి ప్రభాస్ ఇప్పుడు మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. విశ్వ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ సినిమాను రొమాంటిక్, అండ్ హారర్ జోన్ లో తీస్తున్నారు. ఇటీవల వచ్చిన గ్లింప్స్ కూడా బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమాపై నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ… మేము చాలా సైలెంట్ గా వచ్చి బిగ్ హిట్ కొడతామని అన్నారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ప్రభాస్ పెద్ద సినిమాలు అన్నీ లైన్ లో ఉన్నాయని… దీని షూట్ కూడా చాలా సైలెంట్ గా జరుగుతోందని, ఇది చాలా పెద్ద సినిమా అన్నారు నిర్మాత. అలాగే 38 వేల చదరపు అడుగుల్లో ఒక భారీ సెట్ వేశామని… ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ లో సెట్ వేయలేదని అన్నారు ఆయన. యాక్షన్ సీన్స్, మ్యూజిక్, రోమాన్స్, హారర్ అన్నీ కూడా ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయని చెప్పుకొచ్చారు.