Sharuk Khan: ఏడాదిలో రూ. 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన రెండు సినిమాలు.. ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే తొలిసారి..

షారూఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ బాద్ షా గా పేరును తెచ్చుకున్నారు. చాలా కాలం తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులతో ఇబ్బంది పడి సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా భారతదేశంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకొని బాద్ షా ఈజ్ బ్యాక్ అంటున్నారు. దీనిపూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2023 | 10:10 AMLast Updated on: Sep 12, 2023 | 10:14 AM

In The History Of India Two Films In The Same Year Cost Rs 500 Crore Is Collected For The First Time

2023 షారూఖ్ ఖాన్ కి కలిసొచ్చిందని చెప్పాలి. దీనికి కారణం ఆయన చేసిన సినిమాలు. ఈ ఏడాది చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ అవి సాధించిన విజయాలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఒకే ఏడాదిలో రూ. 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన 2 సినిమాలను చేయడంతో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

పఠాన్..

ఈ ఏడాది ఆరంభంలో జనవరి 25న విడుదలైన పఠాన్ సినిమా రూ. 1050 కోట్ల కలెక్షన్లు సాధించడం మనకు తెలిసిన విషయమే. యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్, అందాల తార దీపికా పదుకొణె, జాన్ అబ్రహం, ఏక్తా కౌల్ తదితర బాలీవుడ్ అగ్రతారలందరూ నటించారు. యాక్షన్ త్రిల్లర్ జోనర్లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఈ సినిమా ఇన్నికోట్ల కలెక్షన్స్ రాబట్టడానికి ప్రదాన కారణంగా చెప్పాలి. అయితే దీపికా అందాల ఒలకపోతపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చిత్రంలోని కొన్ని అశ్లీల సీన్లను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో ఈ సినిమా పెద్ద కాంట్రవర్సీకి గురైంది.

జవాన్..

ఏడాది ఆరంభంలోనే హిట్ కొట్టిన షారూఖ్ అదే జోష్ ను కొనసాగిస్తూ జవాన్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 531 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం రూ. 1000 కోట్ల క్లబ్ లోకి చేరుకునేందుకు దగ్గర్లో ఉంది. ఇప్పటికీ ఈ సినిమాపై పాజిటివ్ టాక్ కొనసాగుతూనే ఉంది. షారూఖ్ ఖాన్ హీరోగా, అత్లీ కుమార్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి ఇలా అగ్రతారాగణంతో తెరకెక్కిన చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కుగా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీ బ్యానర్ పై గౌరీ ఖాన్ నిర్మించగా అట్లీ దర్శకత్వం వహించారు. ఇది కూడా యాక్షన్, థ్రిల్లర్ తో పాటూ కొంత కామెడీని కూడా మిక్స్ చేసి థియేటర్లలో విడుదల చేశారు. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తేనే ఉంది.

అటు పఠాన్, ఇటు జవాన్ మూడు అక్షరాల టైటిల్ తో విడుదలైన ఈ రెండు సినిమాలు ఒకే ఏడాదిలో రూ. 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో భారతదేశ చరిత్రలో ఒకే ఏడాది రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమా ఎక్కడా ఎప్పుడూ లేదని క్రిటిక్స్ సైతం ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది.

T.V.SRIKAR