BJP And Jana Sena: తెలంగాణలో ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ – జనసేన.. 33 స్థానాలు కోరిన పవన్ కళ్యాణ్
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ - జనసేన కలిసి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రంలోపూ సీట్ల సర్థుబాటు విషయంలో ఒక కొలిక్కి రావాలని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గానూ తనకు 33 స్థానాలు కేటాయించాలని కోరారు. బుథవారం సాయంత్రం అమిత్ షా ను కలిసి సుమారు 40 నిమిషాల పాటూ చర్చించినట్లు తెలుస్తోంది. తాను శుక్రవారం తెలంగాణలో జరిగే సభకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ లోపూ సీట్ల సర్థుబాటుపై ఒక అవగాహాకు రావాలని ఇద్దరికీ సూచించారు. మరోసారి భేటీ అయి సీట్ల సర్థుబాట్ల అంశంపై ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. జనసేన నాయకులు ఉమ్మడి హైదరాబాద్ తో పాటూ మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గండ, మెదక్ జిల్లాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే.
అమిత్ షా భేటీలో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. అభివృద్దిలో తప్పకుడా సహకరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ తో పొత్తు అంశం చర్చకు వచ్చినట్లు లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే కలిసి పనిచేసే అంశంపై చర్చించారు. అమిత్ షాతో భేటీ అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన వేరే సమావేశంలో బిజీగా ఉండటం వల్ల కలవలేక పోయారు. అమిత్ షా తో భేటీ అనంతరం ఎలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. పవన్ కళ్యాణ్ , కిషన్ రెడ్డిలు నేరుగా ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.పొత్తు విషయంలో జాతీయ నాయకులతో మాట్లాడుదామని పవన్ అనడం వల్లే అమిత్ షాతో భేటీ అయినట్లు కిషన్ రెడ్డి చెప్పారు.
T.V.SRIKAR